Others

నిజంతో ముప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజం చెప్పడంవల్ల హింస, కష్టం, విపత్తు వాటిల్లుతాయని తెలిస్తే నిజం చెప్పకపోవడమే ఉత్తమం. ఇదేంటి అందరూ సత్యమే మాట్లాడాలి. ధర్మమే ఆచరించాలి అని చెప్తారు కదా. మరి ఇదేమిటి ఇలా అంటారు అనుకుంటున్నారా? ఒక్కోసారి అబద్ధాల వల్ల చెడు జరుగకుండా ఉంటుంది. మంచి జరగకున్నా ఫర్వాలేదు కానీ చెడు జరిగితే మంచిది కాదు కదా. అందుకే అవసరమైన చోట అబద్ధం చెప్పాల్సి వస్తే అది అనర్థాన్ని ఆపుతుంది అంటారు.- భారతంలో కర్ణపర్వంలో ఓ ఇతిహాసముంది. కౌశికుడనే బ్రహ్మ ఓ పుణ్యక్షేత్రంలో నివసించేవాడు. అతడు సత్యనిష్ఠతో తపం చేస్తుండగా కొందరు బాటసారులు దొంగలను చూసి భయపడి దగ్గరలో ఉన్న పొదలమాటున దాక్కున్నారు. దొంగలు బాటసారుల గురించి కౌశికుని అడిగేరు. కౌశికుడు నిజం చెప్పకపోతే తనకి అసత్య దోషం అంటుతుందని సంశయించి పొదల్లో దాక్కున్నారని వున్నదున్నట్లు చెప్పాడు. దొంగలు వారిని చంపి డబ్బు దోచుకుని పారిపోయారు. కొంతకాలానికి కౌశికుడు మరణించాడు. అతను సత్యమే చెప్పినా ప్రాణరక్షణ కోసం భయంతో దాక్కున్న వారికి తనవలన ముప్పు వాటిల్లింది. ఆ కారణంగా నరకానికి పోయాడు. కనుక, ఇటువంటి సందర్భాలలో సత్యం చెప్పడం ధర్మంకాదు. అసత్యం చెప్పి హింస జరక్కుండా, ప్రాణహాని కలుగకుండా కాపాడవచ్చును. ఇతరులకు హానీ కలిగించే సత్యాన్ని పరిహరించాలి. సత్యాసత్యాలు పలకడంలోని ధర్మసూక్ష్మత నెరిగి పరిణామాలను గ్రహించి సందర్భానుసారం వాటిని పలకాలని భారతం చెప్తోంది. తన ప్రాణం, ఇతరుల ప్రాణం అపాయంలో ఉన్నప్పుడు రక్షించేటప్పుడు అసత్యం పలుకడం తప్పుకాదు. అలా అని ఎప్పుడు స్వార్థం కోసం అబద్ధాలు ఆడితే దానివల్ల ముప్పు తప్పక వస్తుంది. *