Others

దాన విశిష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో యజ్ఞయాగాదులు తపస్సుల ద్వారా మానవులు మోక్షం పొందారు., కలియుగంలో దానధర్మాలు, దైవారాధన, నామ పారాయణ, నామస్మరణ మొదలైన వాటి ద్వారా సులభతరమైన మోక్షమార్గాన్ని దైవం ప్రసాదించాడు. దానధర్మాలు ఎవరికున్నంత వారు దానం చేసుకోవచ్చు. ఈ దానం చేసేది కూడా మనస్ఫూర్తిగా చేస్తే చాలు. ఆడంబరాలకు పోనవసరం లేదు. దానాల్లో కూడా అన్నదానం, వస్తద్రానం, జలదానం గోదానం, కన్యాదానం, సువర్ణదానం, భూదానం మొదలైనవన్నీ చాలా విశిష్టమైనవి. మనిషిని సంతృప్తిపరచేది అన్నదానము. దాహార్తిని తీర్చేది జలదానం. ముఖ్యంగా వేసవికాలంలో బాటసారుల దాహాన్ని తీర్చటం ద్వారా వారికి మనమెంతో మేలుచేసిన వారమవౌతాం. వస్తద్రానం చేస్తే సాక్షాత్తూ ఆ భగవంతుడికే వస్త్రాన్నిచ్చిన పుణ్యం కలుగుతుంది.ఎండా, వానా చలినుండి పేదలకు కాపాడిన తృప్తీ మనకు దక్కుతుంది.
గోదానం మహిమ చెప్పనలవికానిది. గోవును దూడను కలిపి దానం చేస్తే, మన పితృదేవతలను వైరతరణీనదిని దాటించి స్వర్గలోక గతులను చేసిన పుణ్యం దక్కుతుంది. దానాలన్నింటిలోకి ఉత్కృష్టమైనది భూదానం. భూమిని మన పెద్దలు రత్నగర్భ అని పిలిచారు. సువర్ణ, జల నవరత్న ఖచిత, మణి మణిక్యాదులన్నీ భూమిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి భూమిని దానం చేయటంవల్ల భూమితోపాటుగా, పైవాటినన్నింటినీ కూడా దానం చేసిన ఫలితం ఉంటుంది ఆ భూమిలో పొందే పంటల వలన మానవులకే కాక పశుపక్ష్యాదులకన్నింటికి ఆహారం చేకూర్చినవాళ్లవుతాం. పేదలకు జీవన భృతి దొరుతుంది.
మనం చేసే దానంలో స్వార్థం లేకుండా, ఫలితం ఆశించకుండా చేస్తే ఆ దేవుడే దానాన్ని గ్రహించడానికి వస్తాడని అంటారు. కర్ణుడు, బలిచక్రవర్తి మొదలైనవారి దగ్గరికి భగవంతుడే యాచకుడిగా వచ్చి దానం స్వీకరించి, వారికి మోక్షాన్ని ప్రసాదించినాడు కదా. ఒక మనిషి మరణించినా, అతడు చేసిన దానధర్మాలవలన ఆజన్మాంతరం అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. దానమిచ్చుటయే కర్తవ్యము. అనుభవము కలిగి, దేశ కాల పాత్రముల నెరిగి, ప్రత్యుపకారము నాశింపక చేసే దానం అత్యున్నతమైంది. ఆకలిగొన్నవారికి అనాధలకు, రోగులకు, అసమర్థులకు, అన్నవస్త్ర ఓషదులు మొదలైనవి లేనివారికి, విద్వాంసులకు బ్రాహ్మణులకు ధనాదులచే సత్కరించుట యోగ్యత - పాత్రత గల దానము అనబడును. భగవద్గీతలో కృష్ణ్భగవానుడు యజ్ఞ దాన తపోరూపములైన కర్మలను ప్రతిఫలాపేక్ష లేకుండా తప్పక ఆచరించవలెనని చెప్పాడు.
*