Others

వదలాల్సింది విషయ వాసన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేహాత్మ వివేకము లేనపుడు అహంకారం ఉదయిస్తుంది. అవిద్యా సంబంధం వలననే మనకు అవివేకం కలుగుతుంది. అంటే వివేకం దూరమవుతుందన్నమాట. అవిద్యా సంబంధం వలననే కర్మ కలుగుతుంది. ఆ కర్మను నశింపచేయుటయే శకటాసుర వృత్తాంతం అంటారు. అది ఎట్లనో చూద్దాం.
ఏ కర్మ అయినా భగవత్పాదస్పర్శతోనే తొలగుతుంది. బండి మనలను ఒక చోట నుంచి మరో చోటికి తీసుకుని వెళ్తుంది. ఆత్మను ఒక శరీరం నుంచి మరో శరీరానికి కర్మఅనే బండి చేరుస్తుంటుంది. ఈ కర్మ అనే బండికి కూడా రెండు చక్రాలున్నాయి. అవే ఉత్తరపూర్వాఘములు. ‘శం కటయతి’ అనగా సుఖమును నశింపచేయునది అని అర్థం.
అహంకారం, కర్మ నశించినప్పటికీ రుచి వాసను నశించవు. లోపల రుచి వాసనారూపాంగా నుండి సమయానుకూలంలో బయటపడుతుంది.
ఉదాహరణకు వత్సాసురుడు రుచి, దూడ దానిని రుచి చూచుచుండును.వాసన- కపిత్థాసురుడు అంటే కపిత్థ మనగా వెలగపండు. వెలగపండు వాసన ప్రసిద్ధమే కదా. మొదట రుచి, తరువాత వాసన నశించివలయును. అనగా రుచితో వాసన తొలగవలెను. వత్సాసురునితో కపిత్థాసురుని కృష్ణుడు సంహరించడంలోని ఆంతర్యమిదే.
అట్లానే గోవర్థన గిరి ని ఎత్తడంలోని ఆంతర్యం తెలుసుకుందాం.
దేవేంద్రుడు కురిపించిన రాళ్లవాన విషయ వ్యామోహమన్నమాట. ఒక్కొక్కరాయి ఒక్కొక్క ప్రాణిని చంపుతుంది. ఒక్కొక్క విషయం ఒక్కొక్కని నశింపచేస్తుంది. విషయ వ్యామోహం నశింపచేయుకుండా వలయుననగా గోవర్థనమెత్తవలెను. వర్థనమనగా పెంచుట, వాక్కును పెంచుట అంటే రాముడను నేను, కృష్ణుడను నేను అనే భావం తొలిగి శరీరం వరకు కాక ఆత్మవరకు వెళ్లాలి అటునుండి పరమాత్మ వరకు వెళ్లాలి. అనగా ప్రతి వస్తువు నందు ప్రకృతి ‘జీవుడు’ పరమాత్మ యుందురు. రాముడు అంటే రామరూప శరీరంతో చేరియున్న ఆత్మ కంతర్యామి యైన పరమాత్మ అని అర్థం. ఇట్లు వాక్కునకు అర్థమును పరమాత్మ వరకు తెలుపుటయే గోవర్ధనమెత్తుట. పరమాత్మ వరకు తెలసినవానికి విషయ వ్యామోహము తనకు తానుగానే నశించును. అనగా హాని చేయజాలదు. ఇది గోవర్థనంలోని రహస్యార్థం.

- ఆర్ లక్ష్మణమూర్తి 7207074899