Others

అలా.. అన్నమాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాభారతంలోని విరాటపర్వ గాథ ఆధారంగా రాజ్యం పిక్చర్స్‌వారు నిర్మించిన చిత్రం ‘నర్తనశాల’ (1963). కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కథాకథనం, సాంకేతిక విషయాలు ఉన్నత ప్రమాణాలను సంతరించుకుంది. కీచకుడిగా ఎస్వీ రంగారావు తన విశ్వరూపం చూపించారు. ఆయన డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది. అందుకే జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో ఆ పాత్రకుగాను ఎస్వీఆర్‌ను విశిష్ట బహుమతి వరించింది. అంతర్జాతీయ స్థాయిలో మొదటి బహుమతిని అందుకున్న నటుడు ఎస్వీఆర్. అదే ఫిలిమ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రానికి అద్భుతంగా కళాదర్శకత్వం వహించిన ఏకహస్త శిల్పి టి.వి.ఎస్.శర్మ (పదేళ్ల వయసులో ప్రమాదవశాత్తు ఎడమ చేయి పూర్తిగా కోల్పోయారు) గారికి కూడా ఉత్తమ కళాదర్శకుడి అవార్డు లభించింది. బృహన్నలగా ఎన్టీఆర్ హావభావాలు ప్రేక్షకులను మైమరపించాయి. బృహన్నల నాట్యాచారుడిగా నాట్యం చేస్తూ ఉత్తర వేషంలో ఉన్న ఎల్.విజయలక్ష్మికి నేర్పించాలి. నృత్య దర్శకుడు వెంపటి సత్యం తెల్లవారుఝామున లేచి నాలుగు గంటలనుండి ఆరు వరకు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి నాట్య భంగిమలు నేర్పేవారట. ఆ రిహార్సల్స్ నెల రోజులు జరిగాయి. సైరంధ్రిగా సావిత్రి నటన హైట్స్‌కు వెళ్లింది. ఉత్తరగా నటించిన ఎల్.విజయలక్ష్మి చక్కని నృత్యాలు చేసింది. మల్లయుద్ధ ప్రవీణ దండమూడి రాజగోపాల్ భీమునిగా నటించడం, అలనాటి గ్లామర్ తార కాంచనమాల ఒక చిన్న పాత్ర ధరించడం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్లేబ్యాక్ పాడటం ఈ చిత్రంలోని విశేషాలు. ఎమ్.ఎ.రెహమాన్ ఫొటోగ్రఫీ చిత్రానికి వనె్నతెచ్చింది. సముద్రాల సీనియర్, శ్రీశ్రీ, కొసరాజులు రాసిన పాటలకు సుసర్ల దక్షిణామూర్తి కూర్చిన బాణీలు ప్రేక్షకులను రంజింప చేశాయి. ‘నరవరా.. ఓ కురువరా’ అంటూ పద్మిని ప్రియదర్శిని చేసిన నాట్యం చిత్రానికి హైలెట్. అతిథి పాత్రలో కాంతారావు, లక్ష్మీరాజ్యం, సూర్యకాంతం నటించారు. జననీ శివకామినీ, సఖియా వివరించవే, సలలిత రాగసుధారస రాగం, దరికి రాబోకు రాబోకు రాజా, ఎవ్వరికోసం ఈ మందహాసం పాటలు పాపులర్ అయ్యాయి. ‘ఏనుంగునెక్కి, కాంచనమయ వేదిక’ పద్యాలు ఘంటసాల గళంలో జీవం పోసుకున్నాయి. ఈ చిత్రం శత దినోత్సవాలు జరుపుకుంది.

-పూజారి నారాయణ