Others

బాల్య వివాహాలపై నారీభేరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలపై లైంగిక వేధింపులు, గృహహింసకు వ్యతిరేకంగా పోరాడుతున్న ‘గులాబీ గ్యాంగ్’ని స్ఫూర్తిగా తీసుకుని ఉత్తరప్రదేశ్‌లోని ఖుషియారీ గ్రామ మహిళలు బాల్యవివాహాల నిరోధానికి కొంగు బిగించారు. యుక్తవయసు రాకుండానే బాలికలకు పెళ్లిళ్లు చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే తాము అడ్డుకుని తీరుతామని ఆ మహిళలంతా ఇటీవల బహిరంగంగా ప్రతిజ్ఞ చేశారు. చిన్నతనంలోనే వివాహం చేస్తున్నందున బాలికలు విద్యకు, ఉపాధికి దూరమవుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో మత్తుపదార్థాలు, మద్యం వినియోగాన్ని కూడా తాము సహించేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. బుందేల్‌ఖండ్‌లో మహిళా సమస్యలపై ‘గులాబీ గ్యాంగ్’ సభ్యులు చేస్తున్న పోరాటాన్ని చూశాక తమలో చైతన్యం కలిగిందని ఖుషియారీ గ్రామ మహిళలు చెబుతున్నారు. బాల్యవివాహాలు, మద్యం, మాదక ద్రవ్యాలపై సమరభేరి మోగించిన వీరంతా ‘గ్రీన్ గ్రూప్’ పేరిట సంఘటితమయ్యారు. బాల్యవివాహాలపై ‘యునిసెఫ్’ (అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి) చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో మరింతగా చైతన్యవంతమైన ఈ మహిళలు చేపట్టిన పోరాటానికి గ్రామపెద్దలు సైతం మద్దతు పలుకుతున్నారు. ‘గ్రీన్ గ్రూప్’ ప్రభావంతో కొద్దిరోజుల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, ఇటీవల రెండు కుటుంబాల్లో బాల్యవివాహాలు జరగకుండా బాలికల తల్లులే స్వయంగా అడ్డుకున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. పాలిథిన్ కవర్ల వినియోగాన్ని అరికడుతూ, గ్రామంలో పచ్చదనం-పరిశుభ్రత వెల్లివిరిసేలా కూడా మహిళలు కృషి చేస్తున్నారు. ఇతర గ్రామాల మహిళలు సైతం ఇపుడు ‘గ్రీన్ గ్రూప్’ను ఆదర్శంగా తీసుకుంటున్నారని ఖుషియారీ గ్రామపెద్దలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.