Others

మావోల ఆశలపై నీళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మావోల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ముఖ్యంగా దశాబ్దాలుగా నానుతున్న సాయుధ ఘర్షణలకు తావిస్తున్న బోడో సమస్యపై కేంద్రం ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
అస్సాంలోని నాలుగు జిల్లాలతో కూడిన బోడోల్యాండ్ కోసం దశాబ్దాలుగా హింసాత్మక ఉద్యమాలు జరుగుతున్నాయి. వేల మంది బలిదానాలు చేశారు. తాజా ఒప్పందంతో అక్కడ ఇప్పుడు కొత్త ఉషోదయం తొంగి చూసింది.
డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడో ల్యాండ్(ఎన్‌డిఎఫ్‌బి), ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్, బోడో పౌర సంఘాలు కలిసి ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ మొత్తం పరిణామంలో ముఖ్యమైన అంశమేమంటే... ఎన్‌డిఎఫ్‌బికి చెందిన అజ్ఞాత పోరాట వాదులు దాదాపు 1615 మంది తమతమ ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి శాంతియుత పరిష్కారానికి దారి వేయడం. దాంతో అస్సాంలో తిరుగుబాటు తత్వం... సాయుధ దాడుల ముప్పు తొలగిపోయింది. కేంద్రం, అస్సాం ప్రభుత్వం, బోడో సంఘాలు ముందుకొచ్చి త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం ఈశాన్య రాష్ట్రాల చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయంగానే పరిగణించాలి. 1993నుంచి కొనసాగుతున్న ఈ తిరుగుబాటు ఉద్యమంలో ఇప్పటివరకు 4వేల మందికి పైగా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రస్తుతం లొంగిపోయిన కార్యకర్తలకు అన్నివిధాల సాయంచేసేందుకు అస్సాం ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. త్వరలో పునరావాస విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనున్నది. దీంతో మిలిటెంట్ గ్రూపులు తమ సంతోషాన్ని వ్యక్తంచేశాయి. బోడోల్యాండ్‌లో సాయుధ చర్యలు ఇకపై ఉండవని హామీఇచ్చారు. ప్రశాంతంగా ప్రజలు జీవించేందుకు అవకాశం ఏర్పడింది. ఈ సాయుధ ఉద్యమాన్ని ‘డైమరీ’ మరికొందరు మార్క్సిజంతో స్ఫూర్తిపొంది ప్రారంభించారు. ఆ ప్రధాన నాయకుడు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.
అస్సాంలోని కోక్రజార్‌లో ఈ ఒప్పంద విజయోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని శాంతి, సౌభాగ్యంపై ఎక్కువ శ్రద్ధకనబరచాలని పిలుపునిచ్చారు.
సీఏఏ వ్యతిరేక ఉద్యమంతో అట్టుడికిన అస్సాంలోనే ప్రధాని భారీ సభలో ప్రసంగించారు. అనూహ్య స్పందన లభించింది. దేశంలో మిగతాచోట్ల ఆయుధాలు పట్టిన యువత కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన సూచన చేశారు.
మధ్యభారతంలో తమదైన రీతిలో స్థావరాలు ఏర్పరచుకుని ఆయుధాలతో సంచరిస్తున్న మావోయిస్టులు ఈశాన్య రాష్ట్రాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఐక్య సంఘటనగా ఏర్పడి ప్రభుత్వాన్ని సాయుధంగా కూల్చాలన్న ‘కల’ను వారు చిరకాలంగా కంటున్నారు. కాని ఈశాన్య రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో మిలిటెంట్లు సాయుధ మార్గాన్ని వీడుతున్న ‘దృశ్యం’కనిపిస్తోంది. తాజాగా బోడో తీవ్రవాదులు తమ ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి లొంగిపోవడంతో మావోల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. పైగా ఆ ఉద్యమ నాయకులు మార్క్సిజం స్ఫూర్తితో ఉద్యమించడంతో భావసారూప్యం ఎక్కువగా ఉంటుందని ఆశించారు.
అంతకుమునుపు కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దుచేయడంతో కూడా మావోల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం, తీవ్రవాదం మావోలకు వెన్నుదన్నుగా కనిపించింది. పరస్పర సహాయ, సహకారాలతో ఆదాన ప్రదానాలతో కాలం గడిపారు. అనేక సదస్సులు నిర్వహించి స్నేహ సంబంధాలు బలపరుచుతున్నారు. అవసరమైనప్పుడు అర్బన్ నక్సల్స్ బహిరంగంగానే కశ్మీర్ వేర్పాటువాదానికి, ఉగ్రవాదానికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే! ఆర్టికల్ 370 రద్దుతో పరిస్థితి అట్టుడుకింది.
ఇట్లా కశ్మీర్ ఈశాన్యప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో జరిగే ఆందోళనలను ఒక ‘గొడుగు’ కిందకు తీసుకొచ్చేందుకు మావోలు తమ ప్రయత్నాలుచేశారు. బలహీనమైనా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కాని వారి ఆశలపై వరుసగా నీళ్లుకుమ్మరించే విధంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇటీవల లక్నోలో డిఫెన్స్ ఎక్స్‌పో-2020 జరిగింది. ప్రపంచంలోని ప్రముఖ ఆయుధ తయారీ సంస్థలు, వాటి ప్రతినిధులు, ప్రభుత్వ నేతలు, అధికారులు, నిపుణులు, విశే్లషకులు ఇందులో పాల్గొన్నారు. నాలుగు రోజులపాటు సాగిన ఈ ప్రాజెక్టులో కనిపించిన, వినిపించిన విషయాలను మావోయిస్టులు చెబుతున్న యుద్ధకళ- కళ పద్ధతికి ఎక్కడా పొంతన లేదు. ఇందులో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తొలిరోజు స్వాగత ప్రసంగంచేస్తూ యుద్ధరంగంలోకి ఆధునిక సైన్స్-టెక్నాలజీ ప్రవేశించిందని, దాంతో యుద్ధపరికరాల్లో, ఆయుధాల్లో సంపూర్ణ మార్పు చోటుచేసుకుందని పేర్కొన్నారు. భారతదేశం ఇప్పుడు స్వదేశీ పరిజ్ఞానంతో, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ఆయుధ తయారీలో నిమగ్నమైందని, ఆయుధ తయారీ హబ్‌గా భారత్ ఎదిగిందని తెలిపారు. కృత్రిమ మేధ, వర్చువల్ టెక్నాలజీ పెద్దఎత్తున ఉపయోగిస్తోందని, ఆయుధ రంగంలో ‘నయాభారత్’ ఆవిర్భవించిందని, అనేక ఆవిష్కరణలు, ప్రయోగాలు జరుగుతున్నాయని, ఆర్ అండ్ డికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు.
ఆ ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఆయుధాల టెక్నాలజీ, యుద్ధపరికరాలు... పరిశీలించి మావోయిస్టుల మాటలు వింటే అవి పూర్తిగా మతిలేనివిగా తోస్తాయి. ఆయుధాల ఆవిష్కరణ-పరిశ్రమ, ఉత్పత్తి-ఎగుమతి- ఈ అమేయమైన శక్తి, టెక్నాలజీ ఆసరాతో శత్రువును అదుపుచేసే వైనం ఉబికి వచ్చాక- ఈ అమేయమైన శక్తిని గెరిల్లా దళాలతో చిత్తుచేస్తామని ప్రగల్భాలు పలకడం ప్రజల్ని మోసగించడమే తప్ప మరొకటి కాదు.
చైనా నిపుణుడు సున్‌జు ప్రకారం యుద్ధం చేయకుండానే విజయం సాధించడం ముఖ్యం. ఆ ప్రక్రియను పెద్ద ఎత్తున ఒడిసిపడుతున్న వైనం ఇలాంటి ప్రదర్శనల్లో దర్శనమవుతోంది. ఈ నేపథ్యంలో మావోల ఆలోచనలు ఎంత గొప్పగా, ప్రజాజ్ఞానస్ఫూర్తి దాతగా ఉండాలి? దాన్ని గాలికొదిలేసి దండకారణ్యంలో గెరిల్లాదండు నిర్మాణంపై సర్వశక్తులు ఒడ్డటం విడ్డూరం. అన్నివైప
ల మంచి వారి దారులు మూసుకుపోతున్న ‘దృశ్యం’ స్పష్టంగా కనిపిస్తోంది. చివరికి విశాఖ మన్యంలో, కేరళ వైనాడ్ ప్రాంతంలో, జార్ఖండ్‌లో అంతటా ఎదురుదెబ్బలే! అరెస్టులు, లొంగుబాట్లు, ఎదురుకాల్పుల్లో మరణాలు, ఆరోగ్యం సహకరించక ఉద్యమం నుంచి విరమించుకోవడం.. ఇదే కనిపిస్తోంది తప్ప ఇంతకుమించిన ఉత్తేజకర, నిర్మాణాత్మక అంశమేదీ తెరముందుకు రాలేదు.
తాజాగా ఒడిశాలో ఓ కీలక మావోయిస్టు నాయకుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. విశాఖ మన్యంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలకు కారకుడిగా భావిస్తున్న జిప్రో మల్కన్‌గిరి ఎస్‌పి ఎదుట లొంగిపోయాడు. అతనిపై రూ. 4 లక్షల రివార్డు ఉంది. అలాగే విశాఖ మన్యంలో ఇటీవల సీనియర్ మావోయిస్టు నాయకుడు ఆజాద్, అతని భార్యను పోలీసులు అరెస్టుచేశారు. ఆజాద్‌పై రూ.20 లక్షల రివార్డు, అతని భార్య ఫూల్‌వతిపై రూ.8 లక్షల రివార్డు ఉంది.
ఇక ప్రజాసంఘాలకు చెందిన వారిని సైతం ప్రభుత్వం పెద్దఎత్తున అరెస్టు చేస్తోంది. మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలతో తెలంగాణ ప్రజాఫ్రంట్, తెలంగాణ విద్యార్థివేదిక, చైతన్య మహిళా సంఘం, విరసం నాయకులు వివిధ కేసులను ఎదుర్కొంటున్నారు. ఎన్ని కవర్ సంఘాల ముసుగులో ఉన్నా వారు అరెస్టవుతున్నారు. దీన్నిబట్టి ఏం అర్థమవుతోంది? హళ్ళికి హళ్ళి... సున్నాకు సున్నా అనే కదా?

- వుప్పల నరసింహం 9985751799