Others

తమలపాకు - విశిష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమలపాకును ముతె్తైదువులకు తాంబూలం ఇవ్వడానికి వాడుతారు. ఏ పూజలోనైనా తమలపాకులను ఉపయోగిస్తుంటారు. ఆంజనేయస్వామికైతే తమలపాకులతో అర్చనాదులను నిర్వహిస్తారు. మృష్టాన్నభోజనం తిన్నతరువాత జాజి లాంటి సుగంధ ద్రవ్యాలతో కలిపి చక్కని తాంబూల సేవనం చేసేవారున్నారు. తాంబూలం వేసుకొంటే ఎంతో మానసిక తృప్తినే కాక మంచి ఆరోగ్యమూ కలుగుతుందనేవారున్నారు.
ఇంత ప్రశస్తి ఉన్న తమలపాకులు క్షీర సాగరమధనంలో వెలువడ్డాయని పురాణ కథనం. తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయని వాటిని మనుష్యులకు అందించాలనుకొన్న శివపార్వతులు హిమాలయాల్లో వీటిని నాటినట్లు జానపదుల కథల్లో ఉంది.
తమల పాకు ఔషధప్రదాయిని కాక పవిత్రమైన ఆకుగా ప్రసిద్ధిచెందింది. తమలపాకును పరిశీలించినపుడు- తమలపాకు పైభాగంలో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారట. మధ్య భాగంలో సరస్వతీదేవి, చివరలో మహాలక్ష్మి నివాసం ఉంటారని అంటారు. తమలపాకు కాడకి, కొమ్మన మధ్యన జ్యేష్ఠాదేవి నివాసం. విష్ణుమూర్తి నివాసస్థానం కూడా తమలపాకే. భూమాత తమలపాకుకు కుడిభాగంలో ఉంటుంది. తమలపాకు ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్యదేవి నివసిస్తారు. సుబ్రహ్మణ్యం తమలపాకు అంతా వ్యాపించి ఉంటాడు. ఇంద్ర, శుక్రులకన్నా ముందు తమల పాకు అగ్రభాగంలో శివుడు, కామదేవుడు నివసిస్తూంటారు. *