Others

కాశీ స్మరణం పాపనాశనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశీని జీవితంలో ఒక్కసారన్న దర్శించాలన్నది భారతీయుల ఆకాంక్ష గా ఉంటుంది. కాశీలో మరణించినవారికి శివసాయుజ్యం తప్పక లభ్యమవుతుందని అంటారు. కాశీని దర్శించినవారు గంగానదినీ దర్శించుకుంటారు. గంగాస్నానం ఎంతో పవిత్రం. కాశీలో గంగాస్నానం చేసినవారు ఎవరైనా కాలభైరవుని దర్శనం చేసుకున్నవారు శివప్రీతులు అవుతారనే ఐతిహ్యం ఉంది.
కాశీవిశే్వశ్వరుని దర్శనం: కాశీలో ఎవరికి వారు శివుడిని అభిషేకించుకునే వీలుంటుంది. కనుక శివభక్తులంతా కాశీ విశే్వశ్వరుని దగ్గరకు వెళ్లినపుడు పాలు, నీళ్లు ఇతర అభిషేక పదార్థాలను వెంట తీసుకొని వెళ్లి శివాభిషేకం చేస్తుంటారు. పొద్దున నాలుగు గంటలకు, తిరిగి సాయంత్రం 7.30కు సర్వదర్శనానికి వీలుగా ఉంటుంది.శ్రీనాథుడు క్షుద్బాధతో కుమిలిపోయి కాశీనే తిట్టదలిచిన వ్యాసునికి కడుపునిండుగా అన్నంపెట్టిన తల్లిగా కీర్తించిన అన్నపూర్ణాదేవి కాశీలోని అన్నపూర్ణాలయంలో ప్రతిష్ఠితమై భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఈ అన్నపూర్ణాదేవిని దర్శించినపుడు అక్కడే దేవాలయ ప్రవేశద్వారం దగ్గరే భాస్కరాచార్యులుప్రతిష్టించిన శ్రీచక్రలింగదర్శనం కూడా చేసుకోవచ్చు.
ఆ తరువాత కాశీవిశాలక్షిని దర్శించుకోవాలి. లలితాఘాట్ వద్ద వారాహిమాత గుడి ఉంటుంది. విశాలాక్షి మాత గుడికి వెనుకగా వారాహిమాత గుడి ఉంటుంది. మణికర్ణికా ఘట్టంలో మధ్యాహ్నం గంగాహారతి ని ఇస్తుంటారు. ఎంతో పవిత్రమైందిగా ఈ మణికర్ణికాఘాట్‌ను చెబుతుంటారు. కేదారఘాట్ వద్ద కేదారేశ్వరుని దర్శనం, చింతామణి గణపతి దర్శనం చేసుకోవాలి. అస్సీఘాట్ వద్ద లోలార్క కుండం దగ్గర స్నానం చేస్తుంటారు భక్తులు. స్నానం చేయలేని వారు ఈకుండంలోని నీరును తలపై నాలుగుచుక్కలు ప్రోయించుకుంటే సర్వపాపాలు నాశనమవుతాయని ప్రసిద్ధం. లోలార్క ఈశ్వరుని దర్శనంకూడా ఇక్కడే లభ్యమవుతుంది. ఇక్కడికి దగ్గరలోనే దుర్గామందిరం, తులసీ మానస మందిరం, సంకట మోచన హనుమంతుని మందిరం, తిలాభాండేశ్వరుని మందిరం ఉంటాయి. వీటిని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. సారనాథ్ స్థూపం వద్ద బుద్ధుని మందిరం కూడా కట్టి ఉన్నారు.
గంగానదీ ఘాటల దర్శనాన్ని అస్సీఘాట్ నుంచి ఆరంభించి వరుణ నాదీ సంగమం వద్ద ఆదికేశవ్ స్వామి మందిరందాకా వెళ్లివస్తుంటారు. ఇక్డి ఆదికేశవస్వామిని భూలోకంలో మహావిష్ణువు ప్రథమంగా భూమిపైకి కాలుపెట్టిన చోటంటారు. పంచగంగ ఘాట్ వద్ద బిందు మాధవుని గుడి ఉంది. కాలభైరవ స్వామి గుడి దగ్గరనుంచి ఎడమవైపు రోడ్టులో నడిస్త ఓంకారేశ్వరుని దర్శనం, ఉకారేశ్వరుడు ముకారేశ్వరులను దర్శించుకోవచ్చు.
గంగానది ఒడ్డున విశే్వశ్వరుడు, శంక్తాఘాట్ వద్ద మంగళేశ్వరుడు, కేదార్ ఘాట్ వద్ద కేదారేశ్వరుడు దుర్గాకుండ్ వద్ద కుక్కుటేశ్వరుడు, మైదాగిన్ వద్ద శ్రీమసా మృత్యుంజయ స్వామి ని కాశీలోని గంగానదీతీరంలో ఉన్న అన్నీ ఘాట్‌ల వద్ద కూడా ఎందరో దేవీ దేవతలుకొలువై కాశీకి వచ్చిన భక్తులను కాపాడుతుంటారు. అవిముక్తక, ఆనందకానన, మహాశ్మశాన, సురధాన,సుదర్శనం, రమ్య ఇలా ఎన్నో నామాలతో కాశీనగరాన్ని పిలుస్తుంటారు. ఋగ్వేదంలో కాశీని ‘జ్యోతిస్థానం’ అని అంటారు. స్కాందపురాణంలో కాశీక్షేత్ర మహిమ వివరించబడి ఉంది. కాశీ తనకిష్టమైన మందిరంగా పరమశివుడు చెప్పినట్లు పురాణాలుచెబుతున్నాయి.

- ఆర్ . పురందర్