Others

సంపూర్ణ ఆహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరమరాలు తినడానికి చాలామంది ఇష్టపడతారు. అవి తింటే గ్యాస్ అని, ఆకలి తీరదని వారిస్తుంటారు కొందరు. అన్నంతో సమానంగా అన్ని పోషక విలువలు ఉన్నవి బొరుగులే.. మరమరాలు చక్కని బ్రేక్‌ఫాస్ట్ ఫుడ్ మాత్రమే కాకుండా స్నాక్స్‌గా కూడా బాగా ఉపయోగపడతాయి. వీటిల్లో విటమిన్ డి, విటమిన్ బిలతో పాటు కాల్షియం, ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా వీటిని తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా ఉండి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పిల్లల ఎదుగుదలలో మరమరాలు బాగా ఉపయోగపడతాయి. అలాగే బరువు తగ్గాలనుకునేవారికి, ఆహారం మితంగా తీసుకోవాల్సిన డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మరమరాలు మంచివి. మరమరాల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల కాసిన్ని తిన్నా కావలసినంత శక్తి సమకూరుతుంది. వీటిలో పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి జీర్ణవ్యవస్థకు మేలు కలుగుతుంది. మరమరాల్లో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ కూడా ఉన్నందున రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి మరమరాలను సంపూర్ణ ఆహారంగా చెప్పొచ్చు. *