Others

కొలకలూరి పురస్కారాలు -2020

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారానికి చింతకింది శ్రీనివాసరావు (విశాఖపట్నం) నవల ‘బుగతలనాటి చుక్కపల్లి’ ఎంపికయింది. న్యాయ నిర్ణయం చేసిన వారు ఆచార్య గల్లా చలపతి, ఆచార్య యన్. మునిరత్నమ్మ, ఆచార్య కె. దామోదర నాయుడు.
కొలకలూరి భాగీరథి కథానికా పురస్కారానికి యం.వి. రామిరెడ్డి (హైదరాబాద్) కథానికా సంపుటి ‘వెంట వచ్చునది’ ఎంపికయింది. న్యాయ నిర్ణయం చేసిన వారు ఆచార్య జి.దామోదర నాయుడు, ఆచార్య మేడిపల్లి రవికుమార్, డా. ‘రాసాని’ వెంకటరామయ్య.
పురస్కారాలకు అర్హులైన రచయితలకు అభినందనలు. పురస్కార పరిశీలనార్థం తమ నవలలు, కథానికా సంపుటులు పంపిన రచయితలకు, రచయిత్రులకు కృతజ్ఞతలు.
పురస్కారాలకు ఎంపిక అయిన రచయితలకు ఒక్కొక్కరికి నగదు రూ.15,000, మెమొంటో, శాలువాతో సత్కారం 26.2.2020 సాయంత్రం హైదరాబాద్, నాంపల్లి, పొ.శ్రీ.తెలుగు విశ్వవిద్యాలయం, ఎన్.టి.ఆర్. కళాప్రాంగణంలో జరిగే సాహిత్య కార్యక్రమంలో ప్రముఖులు ప్రదానం చేస్తారు.