Others

దుఃఖావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం లేవగానే
సూర్యుణ్ణి చూచాను
నా దిక్కు చూడకుండానే వెళ్లిపోతున్నాడు
కోపం లేదు
కిరణాలను బహిష్కరించాలని లేదు
కోకిల కంఠం విని బయటకు వచ్చి
గళం కలుపాలని ప్రయత్నించాను
దూరంగా వెళ్లిపోయింది
తాపం లేదు/ పాటను నిషేధించాలని లేదు
చిలుక పలుకుల భట్రాజు మాట విని
గడప దాటి బయటకు వచ్చాను
ప్రశ్నిస్తాననే భయంతో పారిపోయాడు
పాపమనిపించింది
వాని భయానికి విరుగుడు లేదు
పరుగులు తీస్తున్నవి
గాడిదలో గుర్రాలో తెలియక
ప్రజాస్వామ్య కళ్లద్దాలలో చూచాను
గాడిదలు గుర్రాల్లా కనిపిస్తున్నాయి
శపించాలని వుంది/ నేను రుషిని కాదు
చెట్టు క్రింది పుట్టలో
పాముందని తెలియక
ఓటు వేయటానికి చేతి లోపల పెట్టాను
కాటు వేసింది
ఒళ్లంతా విషం
అమృతం కోసం పరుగులు తీయాలని లేదు
దీపం ఆరిపోయింది
శాపగ్రస్తున్ని నేను *

-సిహెచ్.మధు..9949486122