Others

మోక్షప్రాప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాశివరాత్రి పర్వదినం వేళా
మనసంతా శివనామస్మరణమే..
జగమంతా శివస్వరూపమయమే..

ప్రాతః సమయాన
పవిత్ర స్నానాలు
పరిశుద్ధ వస్త్ధ్రారణలు
మందిర పుష్పాలంకరణలు
వేనవేల దీప కాంతులతో
ప్రతి ‘హృది’ భక్తి పరవశమే..
ప్రతి ‘లోగిలి’ పవిత్ర మందిరమే..

శివభక్తి భజన సంకీర్తనలు
శివ లింగాత్మక ఆరాధనలు
శివ సహస్రా నామ స్తోత్రాలు
శివామృత మంత్రోచ్ఛరణతో
ప్రతి ‘స్వరం’ శివనాదమే..
ప్రతి ‘జీవం’ శివార్పితమే..

విభూతి ధారణలు
మారేడు దళ పూజలు
అర్చనలు.. అభిషేకాలు
ఉపవాసాలు, జాగరణలు
ధూపదీప నైవేద్య సమర్పణలు
ప్రదోష క్షణాల మహాలింగ దర్శనంతో..
ప్రతి ‘తనువు’ నిర్మల సుమగంధమే..
ప్రతి ‘తలపు’ పులకిత శోభాయమే..

త్రికరణ శుద్ధిగా..
శివరాత్రి వ్రతం ఆచరించు
ప్రతి భక్త ‘హృది’ పావనమే..
ప్రతీ మనిషి ‘జన్మ’ మోక్ష ప్రాప్తమే..
*

-కోడిగూటి తిరుపతి 9573929493