Others

ఓం నమః శివాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివపూజకు
వేళాయంటూ
అడవి అంతటా పూసిన
మోదుగుపూల అరుణకాంతులు
ఉషాకిరణాల సమ్మిళితమై
మిరుమిట్లు గొలుపుచుండగా
ఆకుపచ్చని చీర కట్టిన
ప్రకృతి కాంత
పంచవనె్నల రామచిలుక
కనువిందుగా
మలయ మారుత
శిశిర శీతలములకు
సోయగాలు పోగ..
సప్తవర్ణ సొబగులద్దుకున్న
లతాంతికలు
పారిజాత సుగంధ
పరిమళాలు వెదజల్లగా
చిటారుకొమ్మన కోకిల
తీయని రాగమాలపించగా
డూడూ బసవన్నల
మూపుర సింగారము
గంటానాదములై
శుభరాత్రి శివరాత్రి
పరమశివుని
ఆగమన సూచకములవగా
భరతభూమి కోవెలలుగా
ఇసుకేస్తే రాలనంత
జనజాతర
కనుల కొలుకులలో
ఉబికి వచ్చిన ఆనందాశ్రువులు
వేయి శుభములిమ్మంటూ
జోడించిన చేతులుగా
జాలువారగ
మానవాళి పెదవులై
నర్తించిన
శివనామ స్మరణ
ఆకాశమే హద్దుగా!
*

-మడిపల్లి హరిహరనాథ్ శర్మ.. 9603577655