AADIVAVRAM - Others

కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజులో మనకు ఉన్నవి 24 గంటలు. గంటకి 60 నిమిషాలు. నిమిషానికి 60 సెకన్లు. అంటే రోజుకి 86,400 సెకన్లు.
బ్యాంక్‌లో డబ్బు దాచుకుంటే అది అలాగే ఉంటుంది. వడ్డీ జమ అయతే అది కొంత పెరుగుతుంది. ఏటియం కార్డులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లు వచ్చిన తరువాత పరిస్థితి మారింది. ఎవరైనా తస్కరించే అవకాశం ఏర్పడింది. ఎవరైనా మన డబ్బుని తస్కరిస్తే వాళ్లని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ దొంగని పట్టుకుని మన డబ్బుని తిరిగి పొందే అవకాశం ఉంది. కొన్నిసార్లు మన ప్రయత్నం విఫలం కూడా కావొచ్చు. ఈ పట్టుకునే ప్రయత్నంలో మనం కొంతకాలాన్ని పోగొట్టుకోవచ్చు.
డబ్బు వేరు. సమయం వేరు. సమయం కోల్పోతే తిరిగి పొందలేం. అది ఎన్నడూ మనకు తిరిగి రాదు. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా ఈ విషయాన్ని గుర్తించడంలో, మనలో చాలామంది విఫలం అవుతున్నారు.
మనం కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు తప్పుదారిలో ఎవరో ఒకరు వచ్చి మనకు చికాకు కలిగిస్తారు. ఆందోళనకు గురి చేస్తారు. అదే విధంగా మన మిత్రులు, తెలిసిన వ్యక్తులు, ఆఫీసులో కొలీగ్స్ ఏవో కొన్ని నెగెటివ్ మాటలు మాట్లాడి మన మూడ్‌ని పాడుచేస్తారు. కొన్నిసార్లు మన పై అధికారి మనల్ని విమర్శించి మనల్ని బాధకు గురి చేయవచ్చు. రోజులో ఇట్లాంటి వ్యక్తులు ఎంతోమంది మనకు తారసపడతారు. ఒక్కరోజులో మనకు వున్న 86,400 ల సెకన్లలో 20 సెకన్లో, 30 సెకన్లో తినేసి మనలని అసంతృప్తికి గురి చేస్తారు. మనల్ని అసంతృప్తికి గురిచేసి మన అమూల్యమైన కాలాన్ని తస్కరించిన వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తి కావొచ్చు. పరిచయం లేని వ్యక్తి కావొచ్చు. ఆ తస్కరించిన వ్యక్తిని తిట్టుకుంటూ కూర్చుంటే మన చేతిలో వున్న 86,380 సెకన్లో, ఇంకా తక్కువ సెకన్లో గంగలో కలిసిపోయే అవకాశం ఉంది. కాలం అనేది బ్యాంకులో మనం దాచుకున్న డబ్బు కాదు. మిగిలిన డబ్బు అదే విధంగా ఉండటానికి. కాలం ఎవరి కోసం ఆగదు. పరుగెడుతూనే ఉంటుంది.
మన పది సెకన్లో, ఇరవై సెకన్లో లేదా 20 నిమిషాలో వృధా చేసిన వ్యక్తిని తిట్టుకుంటూ ఆ రోజులో మిగిలిన కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. అది ఎంతవరకు సమంజసం? వృధా అయ్యింది డబ్బు కాదు. వృధా అయ్యింది కాలం. దాన్ని వృధా కాకుండా మిగిలిన సమయాన్ని కాపాడుకోవడం మన విధి.