Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. బుద్ధి వక్రీకరించిన నిద్ధరిత్రిఁ
బుట్టియుంజచ్చినట్లౌగ పుడమి జనులు
ఛీత్కరింతురు బ్రతుకంగ సిగ్గుచేటు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ

భావం: ఈ పుణ్యభూమి యందు బుద్ధి వక్రీకరించిన పక్షంలో అలాంటి వారు పుట్టి కూడా చచ్చిన వారితో సమానం. అలాంటి వారిని తదితర జనులంతా ఛీకొడతారు. అలాంటి ఛీత్కారాలతో బ్రతకడం అనేది సిగ్గుచేటన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించు స్వామీ!
తే.గీ. జన్మ చరితార్థమవ్వంగఁ జక్కనైన
బాటఁ బట్టకఁ దిరుగాడ బాధలవియు
బాధ్యతలఁ దీర్చుకోనివ్వవంతఁ గాంచఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: జన్మ చరితార్థం కావాలంటే సన్మార్గంలో సంచరించాలి. అలాంటి సన్మార్గాన్ని విడిచిపెట్టి సంచరిస్తున్న పక్షంలో చుట్టుముట్టేసిన అనేక బాధలు బాధ్యతలను ఎంత మాత్రం నెరవేర్చుకోనివ్వవన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించు తండ్రీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262