AADIVAVRAM - Others

మైదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లటి గాలిని, చిక్కని
చీకటిని కప్పుకొని కీటకాల
సంగీతాలాపనలో చెట్లకొమ్మలు
వింజామరలై గాలి విసురుతుంటే
మైమరచి మత్తుగా
నిద్రపోతున్నది.
బూట్ల అలికిడి, ఉరుకుల
పరుగుల వెచ్చని
పాదాల స్పర్శను ఎవరిదో
ఆత్మీయ పిలుపునకు
కల చెదిరి ఉలిక్కిపడుతూ..
నిద్రకు మెలకువకు
మధ్యన నడుస్తున్నది.
సూర్యుడు చీకటి దుప్పటిని
తొలగించి కొన్ని
కిరణాలను ముఖముపై
జల్లి తన దినచర్యను
చెవిలో ఊదాడు.
ఆరోగ్యాశావహులు
అక్కడికి చేరి సర్కస్
ఫీట్ల గింజలను కసరత్తు
గానుగలో తిప్పి మట్టికి
చెమట గంధం అద్దిన
పరిమళాలను సేవిస్తరు
నిత్యం ఎందరికో ఆరోగ్య
జ్ఞాన బోధ చేస్తూ ఎన్నో
స్నేహ బంధాలకు
అంకురం తొడిగి మైదానం
నిశితో నిద్రపోతుంది
మంచుతో స్నానమాడి మళ్లీ
ఉదితి నడకకు సిద్ధవౌతది
*

-కొప్పోలు యాదయ్య.. 9494273703