AADIVAVRAM - Others

ముక్తకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోటమాలి
పెంపకం ఒక్కటే
పెరిగాక మల్లె మల్లే
ఉల్లి ఉల్లే

భీరువు
నీడను చూచే భయపడతాడు
ధీరుడు
సింహాలనైనా ఎదిరిస్తాడు

భూత దయ ఉన్నవాడు
చేతం ఉన్నవాడు
జీవుల ప్రేమించేవాడు
జీవేశ్వరుడు

అహం ఉన్నవాడు
అంధుడు
వయం ఉన్నవాడు
విజ్ఞుడు

ఆకశ్మలాన్ని ఎత్తిపోసే
పాకీవాడు ఎంత గొప్పవాడు!
నాకు వానిలో
నారాయణుడు కన్పిస్తాడు

పిల్లికి పిడుచమెయ్యనివాడు
దానధర్మాల గూర్చి చెబుతాడు
హతవిధీ! దయ్యాలు
వేదాలు వల్లిస్తున్నాయి

ఉన్నవాడికి ఇంకా
ఆర్జించాలన్న ఆరాటం
లేనివాడికి మెతుకు కోసం
జీవితమంతా పోరాటం

పాపాత్ముడికి ఎంత చెప్పినా
పాపాత్ముడే
బొగ్గు పాలకడుగ
పోవునా మలినంబు?

నాకు తెలియదు
వేదాల సారం
నాకు తెలిసింది
పేదవారికన్నం పెట్టడం

మంచితనం
మంచిగంధం
ప్రతిష్ట పెంచుతుంది
పరిమళాలు పంచుతుంది

కవి పుట్టింది
అతనిని సంస్కరించేందుకు
గీతం రాసేది
జాతిని మేల్కొల్పేందుకు

పశువు పొలంలో పనిచేస్తున్నది
మనిషే జులాయిగా
తిరుగుతున్నాడు!

అధికారంలో ఉన్నవారిపై
అన్ని ‘స్కాండల్సే, ఏమిటి?
ఎవరురా ఈ దేశంలో
‘చొక్కపు బంగారం?

పాతవైనా కొత్తవైనా
పుస్తకాలు చదువు
పాతకొత్తల వేరుకలయిక
జీవితం - ఎరుగు.

-డా.తిరునగరి