AADIVAVRAM - Others

వౌనం వీడదాం రండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌనం మహాభారత యుద్ధానికి నాంది
వౌనం కాకూడదు పురిటి సంధి
వౌనం ఆవిష్కరించేది కాదు
అంతరంగాలు కొలిచేది
మిత్రమా!
మనలో లోపలి వౌనాన్ని వెలివేద్దాం!
స్తబ్ధతను బ్రద్దలు చేద్దాం!
ఋషులం కాదు
యోగులం కానే కాదు!
నిజం కోసం ఒక్కసారైనా
అంతర్మధనం చేసుకుందాం!
వౌనం మనకు భూషణం కాదు...
మన అతిశయం...
ఇంకా మనలో మనమే మార్మిక భాష మాట్లాడుకుంటుంటే...
దుర్గంధ కశ్మలంలో ఈదుతున్నట్లే!?!
కాదా!

ఆకాశం వౌనాన్ని మింగుతుంది
విపర్యాలొస్తే విస్ఫోటిస్తుంది
ప్రళయంగా - విలయంగా - ఉల్కాపాతాలతో ఉనికి చాటుకుంటుంది
సముద్రం వౌనాన్ని తనలో ముడుచుకుంటుంది
ఉద్రేకాలను - ఉద్విగ్నతలను కెరటాల పొత్తిళ్లలో చుట్టుకుంటుంది...
కట్టదాటితే...
ఉప్పెనలు... సునామీలు
ఊరు, వాడా ఉనికిని కోల్పోతాయి

భూదేవి వౌనమే సహనంగా... ఓర్పుతో గుండెల్లో ఊపిరిగా దాచుకుంటుంది..
అసంబద్ధ కదలికలకు..
భూకంప క్షేత్రంగా కడలినైన కుదుపేస్తుంది
నిప్పు వౌనము నీవురౌతుంది!
అగ్ని కణాల
కార్చిచ్చుగా సప్త జిహ్వల్ని చాస్తుంది. బూది కుప్పల్ని మిగుల్చుతుంది
గాలి వౌనరాగాలతో పలకరిస్తుంది...
మలయమారుతాలతో పులకరింపజేస్తుంది..
అపసవ్యం ఆవహిస్తే మహావృక్షాల్ని సహితం కూకటివేళ్లతో పెకలించివేస్తుంది...
జాతి అచేతనమైనప్పుడు
నీతి అలంకారప్రాయంగా మారుతున్నప్పుడు...
దేశం సుషిప్తిలోకి జారుతున్నప్పుడు...
వౌనం మసిపూసిన మారేడుకాయ
మేధావి మాను మాకుగా నీడనివ్వని ఛాయ!
స్పందించే పంచభూతాలే మన ప్రేరణ...
ఆశయం అజ్ఞాతం వదిలితే...
ముడుచుకున్న నరాలు
సింహనాద స్వరాలు ప్రకంపిస్తాయి.
వౌనం నుండి నిష్క్రమిద్దాం..!
వౌనానికి సమాధి కడదాం!
తరాల స్వాతంత్య్రానికి గ్రహణం పట్టకుండా దిగ్దర్శనవౌదాం..!!
ఫ్రజాస్వామ్య విశ్వగీత శృతి తీగలమై.. జనగీతిగా మిగులుదాం..!!

- బి.ఎస్.నారాయణ దుర్గా భట్