Others

కరుణామూర్తి కైలాసవాసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ శబ్దం మంగళకరమైనది. అందుకే శివుణ్ణి మంగళకరుడు, కల్యాణకరుడు అని పిలువడం జరుగుతోంది. శంకరుడు కరుణా సముద్రుడు. భక్తవశంకరుడు. అందుకే భోళాశంకరుడుగా పిల్వబడుతూన్నాడు.
శివుడు నిరాడంబరుడు. స్మశానం ఆయన నివాసం. నాగుపాము ఆయన ఆభరణం. కట్టుకునేవి చర్మాంబరాలు. విభూతినే ధరిస్తాడు. శివుని కట్టూ బొట్టూ అన్నీ ప్రకృతికి హని కలించే వికృత చర్యలు విడనాడమని చెప్తున్నవే. కనుక శివుని అర్థం చేసుకొంటే మనలోని పశుత్వానికి దూరమవుతాం. దివ్యలక్షణాలకు దగ్గరవుతాం.
శివుడు ఎంతో నిరాడంబరుడో అంతంటి కృపాళువు. శివా అని ఒక్కసారి పిలిస్తే, పిలిచే వారి నిర్మల మనసును చూచి పరుగెత్తుకుని వచ్చి కాపాడుతాడు. అల్పాయుష్కులను, అనంతా యుష్కులుగా మార్చేస్తాడు. చిరంజీవులుగా దీవించేస్తాడు. అంతేకాదు ఆయన సర్వసృష్టికీ కారణా కారణుడు కనుక ఆయన దయనుపొందడానికి మూగజీవులూ ప్రయత్నించుతాయ. ప్రయత్నించ డమే కాదు కృతకృత్యులూ అవుతాయ. శ్రీకాళహస్తి -సాలెపురుగు, పాము, ఏనుగుల అపార భక్తికి కరిగిపోయి వాటికి ముక్తి ప్రసాదించాడుకదా.
అంతేకాదు పండిత పామర వ్యత్యాసం కూడా లేదు. పండితులు పరమేశ్వరా అని పిలిచినా ఓ అంటాడు. పామరుడు శివయ్య ఏమయ్యా పలుకరాదా అంటే ఇక్కడే ఉన్నానంటూ వచ్చేస్తాడు. తన పూజకు ఏ నియమాలు, నిబద్ధలూ పెట్టకుండా ఎవరి మనసుకు తోచినట్లు వారు తన్ను పూజించినా వారిని కరుణించే కరుణామూర్తి కైలాసవాసుడు.
అల్పాయుష్కుడైన మార్కండేయుడు గర్భగుడిలోనికి ప్రవేశించి శివలింగాన్ని గట్టిగా పట్టుకుని దీనంగా వేడుకోగా శివుడు కైలాసం నుండి దిగివచ్చి మెడను పడిన ఆ యమపాశం నుండి మార్కండేయుణ్ణి రక్షించి చిరంజీవిగా ఆశీర్వదించాడు.
తన పూర్వీకుల పుణ్యగతిని గూర్చి భగీరథుడు తపమాచరించి దివి నుండి గంగను భువికి తీసుకువచ్చే ప్రయత్నంలో గంగ వేగాన్ని తగ్గించమని శంకరుని వేడుకోగా శంభుడు తొలుత దివిజ గంగను తన శిరస్సుపై దూకి అక్కడి నుండి భువిని ప్రవహించు విధంగా ఏర్పాటుచేసి భగీరథ ప్రయత్నాన్ని సఫలీకృతం గావించారు.
బోయవాడైన తిన్నడు రోజూ వచ్చి పుక్కిట పట్టిన నీటితో శివలింగానికి అభిషేకం చేసేవాడు. శివుడి మందు పడి ఉన్న చెత్తనంతటినీ తన కాలి చెప్పుతో పక్కకి తొలగించి అదే కాలిచెప్పుతోనే శివుని కనుబొమ్మలమధ్య ఎర్రటి మట్టితో బొట్టు పెట్టేవాడు. తాను తినే మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టేవాడు. ఇంత చేసినా శివుడు తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చి కైవల్య ప్రాప్తి కలిగించాడు.
ఇదే శివుని కరుణ, కృప .

-ఆర్.పురందర్