Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. జ్ఞాన సంపత్తికిందూగు సంపదెచటఁ
గానరాదని గ్రహియించి కనులు దెరచి
దానికై దీక్షఁ బూనుడీ కలమునందుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: జ్ఞాన సంపదతో సరితూగే సంపద ఎక్కడా కనబడదని గ్రహించి కళ్లు తెరిచి అట్టి సంపదను పొందుటకై ఈ భూమిపై దీక్ష బూనాల్సిన అవసరం ఎంతైనా ఉందని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా!ఈలోకానికి ప్రబోధించు స్వామీ.

తే.గీ. ధర్మకంకణ ధారులై కర్మలాచ
రింప వలయును లేకున్న లేదు వంశ
మందుఁ దరతరాలకు సౌఖ్యమెందుఁ జూడఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: అంతా ధర్మ కంకణ ధారులై చక్కగా సత్కర్మలాచరించాలి. అలా ఆచరించని పక్షంలో వంశమందు రానున్న తరాలకు సుఖమన్నది ఎక్కడా లభించదనే వాస్తవాన్ని కర్మసాక్షివైన ఓసూర్యదేవా!ఈ లోకానికి ప్రబోధించుము తండ్రీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262