Others

సంతోషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

84 లక్షల జీవుల్లో కేవలం మనిషికి మాత్రమే తన స్పందనను నోటి ద్వారా తెలియపర్చగలడు. మూగజీవాలు ఎంతో వేదనకు గురైనా అవి వాటి బాధను నోటితో వ్యక్తపరచలేవు. అట్లానే సుఖాన్నై, సంతోషానైన్నా అవి మాట తో వ్యక్తీకరించలేవు. కానీ మనిషి మాత్రమే తన లోని బాధనుకానీ, సంతోషాన్నీ కానీ మాటతో ఇతరులకు చెప్పగలుగుతాడు. బయటకు వ్యక్తీకరించి, ఆలోచించి తనకు నష్టం కలిగించేది, లేదా బాధను మాత్రమే మిగిల్చేది అయితే ఆ విషయాన్ని తననుంచి దూరం చేసుకోగలడు. ఇంత వివేచన ఉన్న జన్మ మాత్రం సర్వ ప్రాణికోటిలోమనుష్యజన్మకే ఉంది. కనుక తన వివేచనతో తన ఆలోచనతో ఉన్నతుడుగా ఎదగడానికి ప్రయత్నం చేస్తే నరుడు నారాయణుడు కాగలగుతాడని ఎన్నో పురాణాలు చెప్తున్నాయి. నారాయణుడు అనే భగవంతుడు ఎక్కడో లేడని, ప్రతిమనిషిలోను చైతన్యరూపంలో కనిపిస్తూ ఉంటాడని అందుకే మరోమనిషికి సాయం చేయడం ద్వారా అంటే ఇతరులకు సాయం చేయడం సేవ చేయడం అంటే మానవ సేవ చేస్తేనే అది మాధవసేవగా మారుతుందని అంటారు.
మానవ సేవ అంటేకేవలం తోటి మనుష్యులకే కాదు తోటి ప్రాణులందరికీ సేవ చేయడం అనేది ముఖ్యం. ఈ సేవ ద్వారానే మనిషి ఆనందం వస్తుంది. ఇది నిర్వచించలేని ఆనందం. ఇంద్రియాల వల్ల వచ్చే ఆనందం కేవలం లిప్త కాలమే ఉంటుంది. కానీ ఇతర ప్రాణులకు చేసినపుడు వచ్చే ఆనందం గుర్తువచ్చినప్పుడల్లా మనస్సును ఆహ్లాదపరుస్తుంది. కనుక శాశ్వతమైన ఆనందాన్ని మనిషి కోరుకోవాలి కానీ తాత్కాలిక సంతోషాలకు సమయాన్ని వెచ్చించకూడదు.
జీవితం అన్నాక సుఖదుఃఖాలు రెండూ వస్తాయి. సుఖం వచ్చినపుడు ఎంత ఒద్దికగా ఉంటే మరింత సుఖాన్ని ఆహ్వానించవారం అవుతాం. దుఃఖం వచ్చినపుడు కూడా కుంగిపోకుండా దేని వల్ల ఈ దుఃఖం సంప్రాప్తమైందో ఆలోచించి ఆ దుఃఖకరమైన సంఘటనకు కారణమేమిటో కనుక్కుని తిరిగి ఆ సంఘటన పునరావృత్తి కాకుండా చూసుకుంటే దుఃఖం కలిగే బాధను దూరంచేసుకోవచ్చు. ఇక్కడ ఆనందం లేక సంతోషం నాకు కావాలనుకోవడం కూడా పొరపాటు అనిపిస్తుంది. మనిషి ఒంటరి జీవి కాదు
. కనుక సంతోషం కూడా నలుగురికీ అందాలి అనుకోవాలి. నలుగురూ సంతోషిస్తున్నపుడు మాత్రమే ఏ మనిషైనా తన సంతోషాన్ని వెలువరించగలుగుతాడు. అందరూ దుఃఖితులై ఉన్నపుడు తన మనసులో అపారమైన ఆనందం కలిగినా దాన్ని వెలువరించేందుకు పరిస్థితులు సహకరించవు. పైగా ఒకవేళ ఆ ఆనందాన్ని వ్యక్తపరిచినా నలుగురూ అవహేళన చేస్తారు. కనుక సంతోషమనేది మనకొక్కరికే రావాలి అనుకోకూడదు. నలుగురూ ఆనందంగా ఉండాలి అనుకొంటే మన సంతోషం ఆ నలుగురితో పంచుకుని మరింత ఆనందచిత్తులు కావచ్చు. ఇక్కడ కూడా నలుగురు బాగుండాలన్న సత్యాన్ని బోధిస్తుంది కాలం. కనుక తోటి ప్రాణి సేవ చేసి దానిద్వారా సంతోషం పొందగలిగితే దాన్ని మించిన ఆనందం, సంతోషం మరొకటి ఉండవు అని చెప్పొచ్చు.

- శ్రీనివాస్ పర్వతాల 9014916532