Others

అదుపు లేని ఆశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశ అనేది అందరికీ ఉంటుంది. ఉండాలి కూడా. ఎందుకంటే నిరాశ నిండినబ్రతుకు. ఎండి పోయిన చెట్టులాగా నిస్సారంగా మారిపోతుంది. బతుకు మీది ఆశతోనే ఎడారిలోనైనా మనిషి బతికి బట్టకడుతాడు. పిరికి పందైనా యుద్ధంలో వెన్నువిరిచి నిలబడడానికి కారణం ఆశనే. ఆశతోనే అవయవ లోపం ఉన్నా పూర్తి ఆయుర్ధాయం ఉంటే లోపాన్ని సరిచేసుకోవచ్చు అని అనుకుంటారు. ఆశ అనేది లేకపోతే మనిషి బతుకు కుంటుపడుతుంది.
భగవంతుడు కల్పించిన జగత్తు అంతా మిథ్యాప్రపంచమనీ , నేను అనేది కూడా మిథ్య అని తెలిసినా ఇది నాకుటుంబం అనీ ఇది నా ఇల్లు అనీ అనుకొంటూ బతుకుతుంటారు. అదీకాక వారు వీరు అనే భేదాలేవీ లేవని ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం అని తెలిసినా వీరు నా వారు, వీరికి నేను ఇది చేయాలి అనుకొంటూ ఎంతో ప్రయాస పడి మరీ చేస్తుంటారు. చేసేది కూడా నేను కాదు అని తెలిసినా ఎంతో కష్టపడి నేను జీవించడమే కాక మిమ్మల్నందరినీ బతికిస్తానన్నాను అని కూడా అంటుంటారు. ఇది భ్రమే కానీ ఆశ అనే విత్తు వల్ల ఇన్ని పనులు చేస్తుంటారు.
ఆశ వల్లనే రూపం లేని భగవంతుడిని తన కళ్లెదుట నిలబెట్టుకుంటాడు.తన పాపరాశిని ధ్వంసం చేయడానికి కూడా ఆశనే రక్షణాయుధంగా పట్టుకుంటాడు.
కనుక మనిషికి తప్పనిసరిగా ఆశ అనే చెట్టు ఉండాలి. దానికి పువ్వులూ , పిందెలు, కాయలు, పండ్లు కాయాలి. కాకపోతే ఆ ఆశ అనే చెట్టు మరీ శాఖోపశాఖలై విసృత్తంగా పెరగకూడదు. ఎందుకంటే ఆశ కాస్త దురాశగా మారుతుంది. లేనిపోనీ కష్టాలను, కన్నీళ్లను తెచ్చిపెడుతుంది.
అందుకనే పెద్దలు ఆశను అదుపులో పెట్టుకోవాలంటారు. గుర్రానికి కళ్ళెంలాగా మనిషి తన మనస్సునుఅదుపులో పెట్టుకున ఆశఅనే చెట్టును ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. అదుపు తప్పిన ఆశ వ్యక్తిని పతనం చేస్తుంది. ‘అన్తఅర్గ్థి తయాదేహే సర్వ దుశే్ఛదమానయం రజ్జ్వేవాశు బలీవర్థః తృష్ణయా వాహ్యతే జనః’ - ముక్కు తాడు చేత ఎద్దు ఏ విధంగా గుంజవైపు ఈడ్వబడుతుందో ఆ విధంగా దేహం లోపల మనస్సుకు కట్టబడిన, త్రెంచడానికి సాధ్యం కానీ ఆశ అనే పాశం చేత మనిషి వేగంగా ఈడ్వబడుతాడు. ఈ ఆశాపాశం అంతమేలేని చాలా పొడవైన తాడు. సముద్ర పర్యంతమైన భూమండలం దక్కినా, దానితో తృప్తి పడిన మానవుల దాఖలాలేవీ ఇంతవరకు లేవని భాగవతాది పురాణాలు చెబుతున్నాయి.
ఆశను జయించి సంతోషంగా ఉండగలగడం మహనీయులకే సాధ్యం.
‘‘అహోబత! మహచ్చిత్రం తృష్ణామపి మహాధియః
దుశే్ఛదామపి కృన్తన్తి వివేకేనా మలాసినా’’
ఛేదించడానికి సాధ్యంగానీ ఈ ఆశాపాశాన్ని ధీమంతులైన వారు తమ వివేకమనే ఖడ్గంతో తెగ నరుకగలుగుతారు. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. అందరూ కూడా ఈ ఖడ్గాన్ని సంపాదించుకుని ఆశ అనే విషపు చెట్టును పెరగకుండా చేయాలి.

- గొల్లాపిన్ని సీతారామ శాస్ర్తీ 9440781236