AADIVAVRAM - Others

వైట్‌డ్వార్ఫ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన సూర్యుడి లాంటి నక్షత్రాలు తమ జీవితకాలపు చివరి దశలో కుంచించుకుపోయి వైట్ డ్వార్ఫ్స్‌గా ఏర్పడతాయి. వాటిలో అప్పటిదాకా జరుగుతున్న న్యూక్లియర్ ప్యూజన్ నిలిచిపోవటం వల్ల ఇది జరుగుతుంది. వీటి సాంద్రత నీటితో పోలిస్తే లక్ష రెట్లు అధికంగా ఉంటుందని ఆర్థర్ స్టాన్లీ ఎడ్డింగ్టన్ అనే శాస్తవ్రేత్త 1920లో అంచనా వేశారు. ఈ విచిత్రమైన భౌతిక స్థితిలో పరమాణువులు ఎంత దగ్గరగా చేరతాయంటే వాటి ఎలక్ట్రాన్లను సైతం కోల్పోతాయి. అంతిమంగా క్వాంటం ప్రభావంవల్ల ఈ ఎలక్ట్రాన్లు మరింతగా తగ్గిపోవటాన్ని నిరోధిస్తుంది. ఫలితంగా బయటి వత్తిడి పెరిగి నక్షత్రం స్థిరపడుతుంది. కొన్నిసార్లు ఈ వత్తిడి నక్షత్రం మరింతగా కుంచించుకు పోవటాన్ని నిరోధించలేదు. ప్రసిద్ధ భారతీయ ఖగోళ భౌతికవేత్త సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ భారీ ద్రవ్యరాశిగల వైట్ డ్వార్ఫ్స్ తమకంటే తక్కువ ద్రవ్యరాశిగల వైట్ డ్వార్ఫ్స్ కంటే చిన్నవిగా ఉండటం చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు.
సూర్యుడితో పోలిస్తే 1.45 రెట్ల ద్రవ్యరాశిగల నక్షత్రాలు స్థిరపడటం సాధ్యం కాదని 1931లో నిర్ధారించాడు. ఇది తన వద్ద వున్న అదనపు ద్రవ్యరాశిలో ఉపరితల భాగాన్ని సూపర్ నోవా పేలుళ్ల ద్వారా విసిరివేస్తుందని లేదా దానిలోని ఎలక్ట్రాన్లు ప్రోటాన్లతో కలిసి న్యూట్రాన్లు - న్యూట్రినోలుగా మారిపోతాయని ఆయన ప్రకటించాడు. సూర్యుడి పరిమాణంతో పోలిస్తే 1.44 నుంచి 3.22 రెట్ల ద్రవ్యరాశిగల నక్షత్రాలు స్థిరమైన న్యూట్రాన్ నక్షత్రాలుగా ఏర్పడతాయి. అదే 3.22 రెట్లకు పైబడిన ద్రవ్యరాశిగల నక్షత్రాలు కుంచించుకుపోతూ ఉండి చివరకు నల్లబిల్లాలు (బ్లాక్‌హోల్స్)గా ఏర్పడతాయి. ఈ ఆవిష్కరణకు గాను చంద్రశేఖర్‌కు 1931లో భౌతిక శాస్త్రానికి సంబంధించి నోబెల్ బహుమతి ఇచ్చారు. ఇది భారీ నక్షత్రాల పరిమాణానికి సంబంధించి ప్రస్తుతం ఆధారపడుతున్న సిద్ధాంతాలకు కారణమయింది.

-నాయక్