Others

సర్వాంతర్యామి గురువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురువు వల్లనే ప్రతివారు జ్ఞానాన్ని సంపాదిస్తారు. గురువు లభ్యమవడం పురాకృత పుణ్యమేనంటారు. అటువంటి పుణ్యఫలం వల్ల లభ్యమయ్యే గురువుమాత్రం శిష్యుల పట్ల అపారమైన దయను కల్గి ఉంటారు.ఒక్కోసారి గురువు ఎదురుగా ఉన్నా శిష్యులు గుర్తించలేరు. కానీ గురువుమాత్రం శిష్యునిపై వాత్సల్యంతో ఎన్నో మంచిమార్గాలు చూపిస్తారు. అటువంటి గురువు షిరిడీ సాయిబాబా.
షిరిడీ సాయిబాబా ఎప్పుడూ మహిమలు చూపేవారు కాదు. ఎవరైనా తప్పు చేయబోతున్నప్పుడే వారిని మందలించేవారు. ఓసారి నానాచందోర్కర్ బాబాదగ్గరకు కూర్చుని ఉన్నాడు. అపుడే కొంతమంది పరదా వేసుకొనే స్ర్తిలు వచ్చారు. వారు వారి ముసుగులను తొలగించి బాబా ను దర్శనం చేసుకొని వెళ్లారు. ఆ సమయంలోనే అనుకోకుండా నానా ఆ స్ర్తిని చూడడం జరిగింది. కానీ ఆమె అందానికి విభ్రాంతి చెంది మళ్లీ మళ్లీ చూడాలనుకొన్నాడు. కానీ సంస్కారం అడ్డువచ్చి చూడకుండా అన్యమన్యస్కంగా కూర్చున్నాడు.
వాళ్లు వెళ్లిపోయాక బాబా ‘నానా! ఈ సృష్టిలో ఎన్నో అందాలను భగవంతుడు సృష్టించాడు. ఈ అందాలన్నీ ఒకనాటికి నశించిపోయేవే. కానీ అందాలను సృష్టించిన భగవంతుని అందం వర్ణించలేనిది. ఎప్పటికీ తరగిపోనిది. అటువంటి అందాన్ని చూడాలని తహతహలాడాలి కానీ తృటిలో నశించిపోయే అందాన్ని చూసి మోహం చెందకూడదు’ అన్నారు. అక్కడ నానాతో పాటు ఉన్న భక్తులకు బాబా చెప్పింది ఏమీ అర్థం కాలేదు. కానీ నానాకు మాత్రం బాబా తన్ను ఉద్దేశించి చెప్పారని, తాను ఏ విధమైన తప్పు చేయబోయాడో అన్న విషయం ఆయనకు తెలసింది. అపుడు తన మనసులో ఉన్నది కూడా బాబా తెలుసుకున్నారని, బాబా సర్వాంతర్యామి అని తెలుసుకుని తన తప్పును సరిదిద్దుకున్నాడు. గురువుగారు ఏ రూపంలో మనలను అనుగ్రహిస్తారో తెలియదు కనుక ఎవరైనా చిన్నా పెద్దా అనే తేడాల్లేకుండా మంచిని బోధిస్తే ఆ బోధను మనం గ్రహించి మనలను మనమే సంస్కరించుకుంటూ ముందుకు వెళ్లితే భగవంతునికి ప్రీతిపాత్రులం అవుతాం.

- ఆర్. పురందర్