Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. గుండె గూటిలో నుండియు కొలదికాని
భావ పరిమళంబుల జాలు పరుగులెత్త
వలయుఁ దానిచో ఁబీనుగై పడుట మేలు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: గుండె గూటి నుండి సద్భావ పరిమళాల ప్రవాహం ఎంతగానో పరుగులు తీయాలి. అలా కానీ పక్షంలో పనుగై పడి ఉండడం ఎంతో మేలు. అంతా సద్భావాలను కలిగి ఉండాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి నీవు విశదపరుచు తండ్రీ!

తే.గీ. మనుట తినుటకా? మనుటకై తినగవలయుఁ
దినుటకై యంత మననేల? కనగ మనుచు
పరుల మనుగడ కై పాటుఁబడగవలయుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: బ్రతకడం తినడానికి కాదుకదా. బ్రతకటం కోసం తినాలి. తినడం కోసం బ్రతకటం దేనికి? ఆలోచిస్తే మనం చక్కగా బ్రతుకుతూ ఇతరుల మనుగడకోసం ఎంతగానో పాటు పడాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి విశదపరుచు స్వామీ.

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262