Others

విజయం ధర్మానిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాండవులు వనవాసం చేసే కాలంలో ఓసారి చాలాదూరం నడిచారు. అలసిపోయి ఒక దగ్గర కూర్చున్నారు. ద్రౌపది కూడా వారి దగ్గరగా కూర్చుని అలసటను తీర్చుకొంటోంది. అపుడు మనకు ఇన్ని కష్టాలు రావడానికి కారణం కేవలం దుర్యోధనుడి అహంకారమే. మనకన్నా పౌరుషంలోను, శక్తిలోను ధర్మాచరణలోను కూడా తక్కువ వున్నవాణ్ణి మనం మట్టికరిపించలేకపోతున్నాం అని ఆవేదన చెందాడు.
ఎన్నో సార్లు దుర్యోధనుడు అర్జునుని చేతిలో ఓడిపోయాడు. నేను కూడా దుర్యోధనుని రక్షించాను. ఎన్నిసార్లు కౌరవులకు మనం లాభం చేకూర్చినా వారు మాత్రం ఎపుడూ మనకు నష్టానే్న కలుగుచేస్తు వస్తున్నారు. ధర్మరాజు ఏమో అందరినీ సమానంగా చూడాలంటాడు. ఎవరికీ కీడు చేయకూడదని హితోక్తులు చెబుతుంటారు. కానీ మనకు జరిగేవన్నీ కుయుక్తుల ఫలితాలే కదా. వారు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని అబద్ధాలు పలికినా హాయగా రాజభవనాలల్లో నివాసం ఉంటున్నారు. మనకు తోడుగా శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు కానీ వారు మాత్రం ఎపుడూ సుఖభోగాలను వదలలేదు. మనమేమో ఎఫుడూ దారిద్య్రంతో బాధపడుతూఉన్నాం. కనీసం తిండికి లోటు లేదులే అనుకుని కూర్చోడానికి ఏమీ లేదు. నిరంతరం కష్టపడాలి. రెక్కాడితే కానీ డొక్కాడని బడుగుజీవుల్లా ఉంటున్నాం మనం అని కూడా అందరి ఎదుట తన వేదనను వెల్లడించాడు. ఇపుడు కూడా వారి వల్ల వాళ్లు చేసిన మోసం వల్ల నేడు అడవుల్లో తలదాచుకుంటున్నాము అని కన్నీళ్ల పర్యంతరం అయ్యాడు.
ధర్మరాజు భీముడిని సమాధాన పరుస్తూ ఎన్నో విషయాలు చెప్పాడు. ఓ భీమా మనం దైవానికి అనుకూలంగా ఉంటే విజయం మనదే అవుతుంది.ఇపుడు కష్టాలు పడినా చివరకు మనకే విజయం లభిస్తుంది. చరిత్రలో కుయుక్తులు పన్నిన దుర్యోధనుడు ఛీ ఛీ అనేమాట నిలుస్తుంది. కానీ పాండవులు ధర్మపరాయణులు అనే మాట మిగులుతుంది. నీకు ఏమాట ఎవరిని అంటే ఇష్టమో చెప్పు ఎలాంటి కీర్తి కావాలని నీవు కోరుకుంటావు అన్నాడు.
దానికి భీముడు ఏముంది ఎవరైనా మంచి కలుగాలని అనుకొంటారు. మంచిపేరు రావాలని అనుకొంటారు కానీ చెడు పేరు చరిత్రలో మిగలాలని అనుకొంటారా అన్నాడు.
మరి కొన్నాళ్లు ఓపిక పట్టు దైవం మనకు అనుకూలంగా ఉంటుంది. మనకూ సర్వ సౌఖ్యాలు లభిస్తాయ అని తమ్మునికి ధర్మరాజు నచ్చచెప్పాడు.
మ రికొన్నాళ్లకు కృష్ణుని సలహా మేరకు అర్జునుడు శివుని గూర్చి తపస్సు చేయడానికి బయలుదేరి వెళ్లాడు.
ఆయనకు దారిలో ఒక అడవిపంది ఎదురైంది. దానిపైకి అర్జునుడు ఒక బాణంవేశాడు. అపుడు అక్కడికి తన సతితో వచ్చిన వేటగాడు కూడా అర్జునుడు వేసిన పందిపైనే బాణం వేశాడు. దాన్ని అర్జునుడు చూసి కోపం తోఎవరు అది నేను వేసిన ఈ బాణం పైన ఇంకొక బాణం వేసింది అని అరిచాడు.
వేటగాడు ఆయన సతీమణి అర్జునునికి కనిపించారు. ఆ వేటగాడు‘ఇది మరీ బాగుంది. ఇదిఅడవి ఎవరైనా అడవిలో ఉండవచ్చు. అసలు నిన్ను చూస్తుంటే ఏదో రాజధానిలోహంసతూలికాతల్పంపైన నివసించేవానిలాగా ఉన్నావు. మాలాంటి అడవుల్లో తిరిగే కిరాతకునిలాగా లేవు.నీకు శరీరధారుఢ్యమే కనిపించడం లేదు. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు’ అన్నాడు.
అలా వారిద్దరి మధ్య మాట మాటపెరిగింది.
కావాలంటే నా తో యుద్ధం చేయి. నీవు గెలిస్తే అపుడు చూద్దాం అన్నాడు అర్జునుడు.
వేటగాడు సరేనని యుద్ధానికి వచ్చాడు. కాని యుద్ధంలో వేటగాడు ఎంతో గొప్పనైన బాణాలను అర్జునునిమీదకు విసురుతున్నాడు. దాన్నిచూసి చూడడానికి కిరాతకునిలాగా ఉన్నాడు. కాని ఇంతటి గొప్ప బాణాలు వేస్తున్నాడు. మరి ఇతను ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూనే వేటగానితో యుద్ధం చేస్తున్నాడు.
ఎంత భీకరమైన భయంకరమైన బాణాలు వేసినా వేటగాడు వాటిని మధ్యలోనే ముక్కలుగా చేసేస్తున్నాడు. చివరకు అర్జునుని అమ్ములపొదిలో బాణాలు అయిపోయాయి. చేతిలో ఉన్నవిల్లునే తీసుకొని వేటగానిపైకి వెళ్లాడు. ఆ విల్లును కూడా వేటగాడు ముక్కలు చేసాడు. దాన్ని చూసి ఆయన సతీమణి చిరునవ్వు నవ్వింది.
దాంతో మరింత కోపం తెచ్చుకుని నాతోయుద్ధానికి రమ్ము అని అర్జునుడు వేటగానిని పిలిచాడు.
వేటగాడు కూడా ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. కాని వేటగాని చేతిలో ఓడిపోతున్నాడు.
ఇంత విపరీతంగా ఉందేమిటి. సామాన్యమైన వేటగాడు నా పై యుద్ధంలో గెలవడం ఏమిటి అనుకొన్నాడు. ఇదంతా దైవప్రేరణ అయి ఉంటుంది. ఏ దైవం నన్ను పరీక్షిస్తోంది. అనుకొంటూ ఓ శివా నేను నీ అనుగ్రహం కోసం వస్తుంటే ఇదేమిటి నాకు ఈ వేటగాడు నన్ను ఓడిస్తున్నాడు. దైవం అనుకూలంగా లేకపోతే గడ్డిపరకకు కూడా నేను తక్కువగా ఉండాల్సిందే కదా అనుకొన్నాడు. మనసులో శివప్రార్థన చేస్తున్నాడు. అపుడు ఆ వేటగాడు తన నిజరూపాన్ని చూపాడు.
కైలాస పర్వతం మీద ఉండే శివపార్వతులు అర్జునునికి కనిపించారు. ఇంత సేపూ నేను కైలాసవాసునితో యుద్ధంచేశానా అనుకొంటూ మన్నించమని పదే పదే వేడుకున్నాడు. తన్ను క్షమించమని కోరుకున్నాడు.
శివపార్వతులు పాదాలు పట్టుకొని అజ్ఞాని నైనా నన్ను మన్నించమని పదే పదే ప్రార్థించాడు.
శివుడు చిరునవ్వుతో నీ కోరిక ఏమిటో చెప్పమని అర్జునుడు అడిగాడు. తన అన్నదమ్ములను, ద్రౌపదిని కష్టాల నుంచి కాపాడమని అర్జునుడు శివుడిని అడిగాడు. శివుడు అర్జునుని భక్తిని మెచ్చుకుని ఎన్నో అస్త్రాలను ఇచ్చాడు. అవేకాక పాశుపతాస్త్రాన్ని కూడా అర్జునునికి శివుడు అనుగ్రహించాడు.
మరికొన్నాళ్లకు కురుక్షేత్ర యుద్ధం జరిగింది.అందులో పాండవులు విజయులు నిలిచారు. అపుడు ధర్మరాజు, భీముడు అర్జునుడు, నకుల సహదేవులు అందరూ కూర్చుని జరిగిపోయన సంగతులు నెమరేసుకుంటూ మనం కష్టాలు పడినా సత్యవంతుల మన్న మాట మిగిలింది. ఇది మనకు మనస్సు తృప్తినిస్తుంది కదా అని అనుకున్నారు.
ఇట్లా మంచినే తలుస్తూ సత్యాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని వీడకుండా ఉంటే ధర్మవిజయం సొంతం అవుతుంది. అంతేకాక మంచి మనసుతో ఉంటే దేవుడే మనకు మంచి దారి చూపుతాడు.

- ఆర్. పురందర్