Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. తప్పుదారులఁ బట్టుచుఁ దమకుఁదాము
వ్యర్థముగఁ జెడిపోవనవ్వారి ఁ గాంచి
బాధపడరని భావింపవలయు సుమ్మి
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: తప్పుదారులు పడుతూ తమకు తాము వ్యర్థంగా చెడిపోతుంటే అలాంటివారిని చూసి ఎవ్వరూ ఏమాత్రం బాధ పడరని భావించవలసినదిగా కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించుము స్వామీ.

తే.గీ. కంటికెదురుగ నున్నట్టి కన్నవారిఁ
గష్టపెట్టంగ ఁ బూనిన ఁ గలలు చెదరి
కష్టనష్టంబులమిత్తమై కలచివేయుఁ
జూడుమో కర్మసాక్షి!యో సూర్యదేవ!

భావం: మన కళ్లముందు కదలాడే తల్లిదండ్రుల్ని కష్టపెట్టడానికి గాను పూనుకుంటే అలాంటి పుత్ర రత్నాలు కన్న కలలు చెదరిపోవడమే కాకుండా కష్టనష్టాలు అధికమై జీవితాలనెంతగానో కలచివేస్తాయన్న సత్యాన్ని కర్మసాక్షి వైన ఓ సూర్యదేవా ఈలోకానికి తెలియజేయుమయ్యా తండ్రీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262