Others

ఈ జీవితం... ఓ నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్ళిపెద్దలం
-షణ్ముఖశ్రీ-
*
సంతోషరావు: వడ్డించింది చాలుగానీ, ఇక పెరుగు వెయ్యి.
సంతానలక్ష్మి: అయ్యో అదేమిటి చారుపోసుకోరా!
సంతోషరావు: ఏమొద్దు! పెరుగే ముద్దు. ఇది కూడా లేకపోతే ఒక ముద్ద కూడా తినలేకపోయేవాళ్లం.
సంతానలక్ష్మి: సరే తినండి.
సంతోషరావు: అన్నట్లు ఇవ్వాళ ఒకతను వచ్చి మన అబ్బాయికి సంబంధం చెబుతానన్నాడు.
సంతానలక్ష్మి: ఏదో ఈ వికారి నామ సంవత్సరంలోనైనా మనవాడికి పెళ్లయితే అదే పదివేలు. వాడు పెద్ద చూపరి కాకపోవటంవలన ఆలస్యమైందిగానీ, లేకపోతే ఈ లవ్వుల రోజులలో, ఈపాటికి ఏ పిల్లో గర్ల్‌ఫ్రెండ్‌నంటూ వెంటబడి ఎగరేసుకుపోయుండేది. మనవాడు సాఫ్ట్‌వేర్ కాదాయే. మామూలు వేరు ఉద్యోగమయిపాయె.
సంతోషరావు: నా భోజనం అయింది. నేవెళ్లి పడుకుంటాను. నీ పనులు చూసుకుని నువ్వు కూడా రెస్ట్ తీసుకో. అతను చెప్పే సంబంధాన్ని గురించి తెలుసుకుందాం.
సంతానలక్ష్మి: అలాగే.
దృశ్యం -5
సంతోషరావు: అప్పుడే నాలుగైపోయిందే. ఫరవాలేదు. రెండు గంటలు బాగానే నిద్రపోయాను. ఆ కేశవరావువస్తాడేమో వేచి చూడాలి.
(సెల్ రింగయింది)
సంతోషరావు: హ!
అవతలనుంచి: ఆ! హలో నేను మోహనరావును. నీకో విషయం చెప్పాలని చేశాను. నీ శ్రేయోభిలాషినీ, నీ స్నేహితుణ్ణి కదా!
సంతోషరావు: కాదని ఎవడన్నాడురా! అబ్బ! ఆ విషయం ఏమిటో చెప్పరా!
మోహనరావు: (అవతలనుంచి) ఈ మధ్య కేశవరావు అనే అతను నీకు పరిచయం అయినట్లుగా తెలిసింది. వాడి విషయంలో కాస్త జాగ్రత్తగా వుండు సుమా!
సంతోషరావు: ఎంతో మంచిగా మాట్లాడుతాడే! ఇవ్వాళ వికారి శుభకాంక్షలు కూడా చెప్పాడే!
మోహనరావు: ఉగాదినాడే నీకు శుభాకాంక్షలు కూడా చెప్పాడూ, ఇంకేముందు అయిపోయావ్, ఈ ఏడాదంతా నీకు ఎడారే! అదేదో సినిమాలో ఒక పాత్ర, ఎవరన్నా పచ్చగా వున్నారంటే వాళ్ళను కాళ్ళనుండి కళ్ళదాకా చూసేది. ఆ దెబ్బతో వాళ్ళు మాడి మసైపోతుండేవాళ్ళు. వీడెక్కడ దొరికాడురా నాయనా!
సంతోషరావు: వామ్మో! ఎంత పాపిష్ఠి కళ్ళా వాడివి.
మోహనరావు: నేనెలాగో వాడి బారినుండి తప్పించుకున్నాను. వాడు ఫోను చేస్తే నేనసలు లిఫ్టే చెయ్యను. ఇంకా చెప్పాలంటే ఏ పండక్కయినా వాడికన్నా ముందే శుభాకాంక్షలు అవి ఓ కాలిచ్చి తప్పించుకుంటాను. నీ మేలు కోరేవాణ్ణి గనుక ఇంతగా చెబుతున్నాను. వాడు కేశవరావు కాదురా నాయనా! పరమ క్లేశవరావు. ఎలాగో వాడ్ని వదిలించుకో! అస్సలు ఓర్వలేని మనిషి. జలసీయే వాడి పాలసీ!
సంతోషరావు: ఓరి నాయనో! మరెట్లారా! పైగా మా అబ్బాయికి సంబంధం కూడా చెబుతానన్నాడే. దానికోసమైనా కొన్నాళ్ళు వాడితో కలిసి మెలిసి తిరగాలి కదరా!
మోహనరావు: నీ కర్మ! ఏం చేస్తాం అలాగే తిరుగు. వాడి దెబ్బేమిటో నీకు తెలుస్తుంది. ఎలా జరగాల్సి వుంటే అలా జరుగుతుంది. ఓకె! ఉంటా మరి (సెల్ ఆఫ్ చేశాడు)
సంతోషరావు: హలో! హలో! సెల్ ఆఫ్ చేశాడు. ఇపుడు నేనేం చేయాలి. ఈ వికారి ఉగాదిలో ఆరంభంలోనే ఈ వికారి దొరికాడే. వాడన్నట్లు ఈ ఏడాదంతా వికారమేనా! వాడు వస్తే నేనేం చేయాలి. వాడు చెప్పిందంతా విని ఊ కొట్టి పంపిస్తా! అంతే
సంతానలక్ష్మి: (ప్రవేశిస్తూ) ఎవరినండీ కొట్టి పంపిస్తానంటున్నారు. మీరు లేవడం చూసి కాఫీ తెచ్చాను, త్రాగండి. ఆ తర్వాత వాడ్ని జోకొట్టి పడుకోబెడుదురుగాని.
సంతోషరావు: (కాఫీ త్రాగి) కాఫీ చాలా బాగుంది. ఏ కూర ముక్కో చేసి వంట కూడా నువ్వే చేయరాదు. ఈ వంటావిడను ఇక మానేద్దాం. పండగపూట కూడా సరిగా చేయకుండా పస్తు పడుకోబెట్టింది, తీసుకొనే డబ్బు తీసుకుంటూ. ఇలా చెయ్యడానికి వాళ్ళ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుందో!
సంతానలక్ష్మి: స్నానం చేసి త్వరగా తెమలండి. ఏ గుడికన్నా పోయి పంచాంగ శ్రవణం వినొద్దాం!
సంతోషరావు: (తనలో) వాడిని తప్పించుకోవడానికి మంచి మార్గం దొరికింది. (పైకి) అలాగే వెళ్దాం.
దృశ్యం -6
(గుడిలో జనం కిటకిటలాడుతున్నారు. ఆ గోల గోలగా వినిపిస్తుంటుంది)
సంతానలక్ష్మి: ఎప్పుడూ వుండే ఆ తిళ్ళ గోలనుండి గుళ్ళ గోలలో కొచ్చిపడ్డాం. పదండి పదండి అక్కడ రెండు కుర్చీలు ఖాళీగా వున్నయ్. పోయి కూర్చుందాం.
సంతోషరావు: పద పద.

(ఇంకాఉంది)
*
హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైన నాటికలు- ఈ జీవితం ఓ నాటకం- రచన:షణ్ముఖశ్రీ. శ్రీ షణ్ముఖ పబ్లికేషన్స్, హైదరాబాద్.