Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ఆభరణములు మనుజులకందమిడున?
విలువపెరుగదు వలువల వలనఁ జూడ
విద్యలేకున్న లోకంబు వెలుగఁ బోదు
చూడుమో కర్మసాక్షి!యో సూర్యదేవ!
భావం: మనుష్యులకు ఆభరణాలు అందాన్నియ్యవు. వస్త్భ్రారణాల వల్ల విలువ పెరుగదు. అందాన్నిచ్చేది విద్య ఒక్కటే అన్న సత్యాన్ని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి ప్రబోధించుము స్వామీ.

తే.గీ. అక్షయంబగు సంపదలందుకొనగ
వలయునన్నను పేదలఁ దలుపవలయు
ననియు భావింపకున్న మేననవసరము
చూడుమో కర్మసాక్షి!యో సూర్యదేవ!

భావం: తరగని సంపదలను అందుకోవాలంటే పేదవారిని గూర్చి తలచుకోవాలి. అలాంటి పేదవారికి సహాయం చేయాలని భావించని పక్షంలో ఈదేహంతో బ్రతికి యుండడం అనవసరం అనికర్మసాక్షివైన ఓ సూర్యదేవా నీవైనా ప్రబోధించుము స్వామీ.

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262