Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ప్రతిభనుం జూచి యోర్వని వారలజ్ఞు
లగణితంబుగ నున్నారలవని యందు
వారిఁ గాంచియు విజ్ఞులు బాధపడక
మిన్నకుండుట యుత్తమమెచ్చటైనఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఎదుటివారి ప్రతిభాసంపత్తిని చూసి ఓర్వలేని అవివేకులు ఈభూమీద అసంఖ్యాకంగా ఉన్నారు. అలాంటివారిని చూసి విజ్ఞులైనటువంటివారు ఏమాత్రం బాధపడక వౌనంగా ఉండడమే ఉత్తమమైన పని అని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! చక్కటి నీ ప్రబోధాన్ని అందించు స్వామీ.
తే.గీ. నైతిక పథాన నిరతమ్ము నడువవలయుఁ
బట్టుదల తోడఁబయనింప వలయునాత్మ
స్థైర్యమును ధైర్యమును వీడఁ దగదుఁ గనగఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: అంతా నీతిపథంలో నడవాలి. అలాగే దీక్షాపట్టుదలలతో పయనం సాగించాలి. నీతి నిజాయతీలే మనిషికి ఆత్మబలాన్నిస్తాయన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఆత్మయందు ధైర్యస్థైర్యాలను ఏమాత్రం విడిచి పెట్టరాదని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకం కళ్లుతెరిపించు స్వామీ.

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262