Others

మరపురాని హాస్యం (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణ్యమూర్తుల అప్పలరాజు, రాజమండ్రిలో మాస్టారుగా ఉద్యోగం చేస్తూ నాటకాలలో హాస్య పాత్రల్లో నటిస్తూ మిమిక్రీ ద్వారా ప్రజలను వినోదపరుస్తున్న కాలం. అలాంటి రోజుల్లో మిత్రుల ప్రోత్సాహంతో మద్రాస్ రైలెక్కాడు సినిమా వేషాల ప్రయత్నంలో. అప్పటికి అగ్రశేణి హాస్య నటుడిగావున్న రేలంగి సొంత సినిమా ‘సమాజం’ మొదలైంది. అదృష్టవశాత్తూ ఆ చిత్రంలో అవకాశం లభించింది అప్పలరాజుకి. అందుకే -‘ఆ హాస్య నటుడి దీవెనల ఫలితమే మాస్టారుగా పనిచేసిన నేను తెలుగు సినిమా రంగంలో ‘స్టారు’నయ్యాను’ అంటూ పదే పదే చెపుతుండేవాడు రాజబాబుగా మారిన అప్పలరాజు. నటనతోపాటు చొరవ కూడా ఉండటంవలన అచిరకాలంలోనే ఆయనా కామెడీ నటుల్లో మూడోస్థానం ఆక్రమించి అగ్రశ్రేణి కమెడియన్‌గా మారాడు. వేషాల వేటలో తాను అనుభవించిన కష్టాలు ఇతరులకు రాకూడదని ఎందరో కొత్తవారిని ఆకలి మరిపించేలా ఆదుకున్నాడు. తాను సంపాదించిన దానినుంచే కొంతమొత్తాన్ని వినియోగించి రాజమండ్రిలో పలు ప్రజాహిత కార్యక్రమాలకి సహాయపడ్డాడు. నిర్మాతగా మారి హాస్య చిత్రాలు నిర్మించాడు. సినిమా నిర్మించాలని వచ్చిన వాళ్లకు తనవంతు సహాయ సహకారాలు అందించాడు. రాజబాబు తెలుగువాడిగా పుట్టి ఉండకపోతే ఏ స్థాయికి ఎదిగేవాడో. ఎందుకు ఇలా అనాల్సి వచ్చిందంటే -తమిళ సినీ రంగంలో యస్‌యస్ కృష్ణన్ అనే హాస్యనటుడు ఉండేవాడు. తమిళనాడు ప్రభుత్వం ఆయనను ‘కలైవానర్’ బిరుదుతో ఘన సత్కారం జరిపింది. అప్పట్లో చిల్డ్రన్స్ థియేటర్‌గావున్న థియేటర్‌ను ఆ హాస్య నటుడి బిరుదువచ్చేలా కలైవానర్ అరంగంగా తీర్చిదిద్దటమే కాకుండా, ఒక పెద్ద కూడలిలో యస్‌యస్ కృష్ణన్ విగ్రహ ప్రతిష్ట చేసి ఆ నటుడు ప్రజాహృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండేలా చేసింది తమిళనాడు ప్రభుత్వం. మన ప్రభుత్వాలకు మాత్రం -సినిమారంగపు ప్రముఖుల సేవలు ఉపయోగించుకోవటం తెలుసు. ఆ సేవలను మరచిపోవటం కూడా బాగా తెలుసు. రాజబాబు తన జన్మదినం రోజున కళారంగంలోని పెద్దలకు సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తూ మూడు రోజులపాటు వేడుకలు నిర్వహించాడు. నేడు రాజబాబు మన మధ్య లేకున్నా, ఆ నవ్వుల రారాజు సృష్టించిన హాస్యాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆనందిస్తున్నాం. రాజబాబు ఇద్దరు కుమారులు. అమెరికాలో స్థిరబడి అక్కడ తెలుగువారు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొని తండ్రి జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. రాజబాబు 40వ జన్మదినోత్సవం హైదరాబాద్‌లో నిర్వహించినప్పుడు రాజబాబు భార్య లక్ష్మిఅమ్ములు (మహాకవి శ్రీశ్రీ మరదలు) తన ఇద్దరు పిల్లలతో కలిసి పాల్గొన్న అరుదైన ఫొటో పైచిత్రంలో చూడొచ్చు. గత ప్రభుత్వాల మాటెలావున్నా, కాసేపు రాజకీయ విమర్శలను పక్కనపెట్టి ఫిల్మ్‌నగర్ కూడలిలోనైనా గతించిన హాస్య నటుల శిలా విగ్రహాలు ఏర్పాటు చేయటం గురించి ఆలోచన చేస్తే మనల్ని మనం గౌరవించుకున్న వాళ్లం అవుతాం.

-పర్చా శరత్‌కుమార్ 9849601717