Others

జగదానంద కారకుడు.. త్యాగరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసంఖ్యాక కీర్తనలకు ప్రాణంపోసి, కర్ణాటక సంగీతంలోని నియమాలను సోదాహరణంగా నిరూపించి, కర్ణాటక సంగీతానికి మూలస్థంభమై, త్రైమూర్త్య వాగ్గేయ కారులలో ఒకరై, నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చునని నిరూపించి ఆరాధనీయులైనారు త్యాగయ్య, త్యాగబ్రహ్మగా వినుతికెక్కిన కాకర్ల త్యాగరాజు. నేటి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కంభం మండలం కాకర్ల గ్రామంలో 1767లో తెలుగు వైదిక కుటుంబీకులైన కాకర్ల రామబ్రహ్మం, సీతమ్మ పుణ్య దంపతులకు జన్మించారు. తండ్రి తంజావూరు ప్రభువు శరభోజి వద్ద ఉండేవారు. త్యాగబ్రహ్మం విద్య కోసం రామబ్రహ్మం తిరువారూర్ నుండి తిరువయ్యూర్‌కు వెళ్ళారు. అక్కడ త్యాగయ్య సంస్కృతం, వేదవేదాంగములను ఆమూలాగ్రంగా పఠించి, శొంఠి వెంకటరమణయ్య వద్ద భక్తిశ్రద్ధలతో సంగీతంలోప్రావీణ్యం సంపాందించుకున్నారు. తండ్రి పిన్న వయసునందే స్వర్గప్రాప్తి నొందగా, అన్నదమ్ముల మధ్య భాగ పరిష్కారంలో తమవంతు వచ్చిన శ్రీరామలక్ష్మణ కుల విగ్రహాలను పూజిస్తూ, వృంఛవృత్తి స్వీకరించి, ఇష్టదైవమైన శ్రీరామునిపై కృతుల రచనలో అధిక సమయం గడిపారు. త్యాగయ్య 96కోట్ల శ్రీరామ నామ జపమాచరించి భగవద్దర్శనం, ఆశీర్వచనం పొందారని చెపుతారు. 18ఏళ్ళ వయసులో పార్వతి అనే యువతిని వివాహమాడారు. పార్వతి చిరుప్రాయ మరణంతో ఆమె సోదరి కమలాంబను పరిణయమాడగా, సీతాలక్ష్మి అనే కూతురు కలిగింది. మనమడు కూడా కలిగాడు. శొంఠి వెంకట రమణయ్య శిష్యరికంలో 13వ ఏటనే4నమో నమో రాఘవా22 అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరిచారు. గురువుగారి గృహంలో చేసిన కచేరీలో త్యాగరాజ ఘనపంచరత్న కృతులలో ఐదవదైన 34ఎందరో మహానుభావులు22 కీర్తనను స్వరపరిచి గానం చేశారు. త్యాగయ్యలోని గొప్పతనాన్ని గుర్తించిన గురువు,
సంగీతంలో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం కన్నా, భగవదారాధనకు ఒక సాధనంగానే చూసారాయన. తంజావూరు రాజు కానుకల తిరస్కార ఫలితంగా, సోదరుడు జపేశుడు, త్యాగయ్యచే నిత్య పూజలందుకునే శ్రీరామ పట్ట్భాషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరి వేయగా, శ్రీరామ వియోగాన్ని భరించలేక తక్షిణ దేశ యాత్రలు చేసి, ఎన్నో ఆలయాలు, తీర్థ క్షేత్రాలను దర్శించారు. ఈ క్రమంలో అత్యద్భుత కీర్తనలను రచించారు. దేవర్షియైన నారదుడే స్వయంగా త్యాగయ్యకు సంగీతంలోని రహస్యాలను చెప్పి, స్వరార్ణవము ఇచ్చినట్లు, ఆ సందర్భంలోనే 34సాధించెనే మనసా22 అనే పంచరత్న మాలికలోని మూడవ కృతి చేసినట్లు ప్రాచుర్యంలో ఉన్నది. నారద అనుగ్రహ ఫలితంగా విషయాలు గ్రహించి, 24000 రచనలు గావించారు. నారద మంత్రోపదేశంతో స్వరార్ణవం, నారదీయం అనే రెండు సంగీత రహస్యార్థ శాస్త్ర గ్రంథ రచనలు గావించారు. త్యాగయ్య కృతులను ప్రాపంచికం, తాత్వికం, కీర్తనం, నిత్యానుష్ఠానం అని నాలుగు విభాగాలుగా గుర్తించారు. ఇవి అన్నీ తెలుగునాట కన్నా, తమిళ నాట ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. 34జగదానంద కారక22 అనే కీర్తన శ్రీరాముని 109నామాలను ఉటంకిస్తుంది. 34జగదానంద కారక, దుడుకుగల, సాధించెనే, ఎందరో మహానుభావులు, కనకనరుచిరా22 అనేవి ఘన పంచరత్న మాలికగా త్యాగ రాజ ఆరాధనోత్సవాలలో ప్రారంభ కీర్తనలుగా గానం చేయబడుతాయి. త్యాగరాజ స్వామి పరమపదించిన దినమైన పుష్య కృష్ణపక్ష పంచమి నాడు శ్రీత్యాగరాజ ఆరాధనోత్సన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రధానంగా తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువయ్యూరులోని త్యాగయ్య సమాధి ప్రాంగణాన ఉత్సవాలు ఏటా జరుగుతాయి. త్యాగయ్య 1947లో మరణించగా, మరణానికి ముందు సన్యాసిగా మారగా, ఆయన భౌతిక కాయాన్ని కావేరీ తీరాన ఖననం చేసి, అక్కడ స్మారక చిహ్న నిర్మాణం గావించారు.ఇప్పటికీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు వైభోపేతంగా జరుపుతుంటారు.

- ఎస్.ఆర్. కిష్టయ్య