Others

. స్క్రీన్ ప్లే ప్రాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయింట్ చిన్నదైనా పవర్‌ఫుల్ స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌ని రెండు గంటలు థియేటర్లో కూర్చోబెట్టడమే మంచి సినిమా లక్షణం అంటున్నాడు -డెబ్యూ డైరెక్టర్ ముఖేష్ పాండే. టైటానిక్ చూసి డైరెక్టర్ కావాలన్న సంకల్పంతో శ్రీకాకుళం టు హైదరాబాద్ వయా గుంటూరు -చేరుకున్న ముఖేష్, ఎల్ 7 కథతో దర్శకుడయ్యాడు. పరిచయాలు, సిఫార్సులు లేకుండా పరిశ్రమకు వచ్చి రైటర్‌గా అనుభవం సంపాదించి దర్శకుడి బాధ్యతలకు ప్రమోట్ అయిన ముఖేష్‌తో ఈవారం చిట్‌చాట్..
మీ నేపథ్యం?
శ్రీకాకుళం టు హైదరాబాద్ వయా గుంటూరు. బాల్యమంతా శ్రీకాకుళంలోనే. గుంటూరులో డిప్లమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యా.
సినిమా వైపు చూపు?
టైటానిక్ చూశాక ‘సినిమా షిప్’ ఎక్కాలనిపించింది. పరిచయాలు, సిఫార్సులు లేకుండానే ఇండ్రస్టీకి వచ్చేశా. ఇవివి కాంపౌండ్‌లో కో-డైరక్టర్ ఈశ్వర్‌రెడ్డి పరిచయం -ఓ టర్నింగ్ పాయింట్. రైటర్‌గా కెరీర్ మొదలైంది. సిద్దూ ఫ్రమ్ శ్రీకాకుళం, సీతారామకళ్యాణం లంకలో.. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మనం చిత్రాలకు వర్క్ చేశాను.
దర్శకుడిగా ఎలా?
శ్రేష్ఠ్ మూవీస్‌తో ఉన్న పరిచయంతో కథ చెప్పా. చేద్దామన్నారు కానీ, కుదరలేదు. తరువాత ఆర్కా మీడియాకూ చెప్పాను. అడ్వాన్స్ ఇచ్చారుకానీ, బాహుబలి ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. చివరిగా బోజ్‌పురి చిత్రాల నిర్మాత సుబ్బారెడ్డి కథ విన్నారు. తరువాత డైరెక్టర్ బాధ్యతలు భుజానపెట్టారు.
ఎలా ఫీలయ్యారు?
నిజానికి మరో రెండు మూడేళ్ల జర్నీ తరువాత డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కు రావాలనుకున్నా. వచ్చిన చాన్స్ వదులుకోవద్దన్న డైరెక్టర్ కరుణాకరన్ సజెషన్‌తో ముందుకెళ్లా.
ప్రాజెక్టు ఎలా వచ్చింది?
కథ చెప్పినపుడు నిర్మాత ముఖంలో కనిపించిన టెన్షన్‌కు పదిరెట్లు రిలీఫ్ ప్రాజెక్టు కంప్లీట్ చేశాక చూశాం. రిజల్ట్ మీద నేను, నా యూనిట్ ఫుల్‌కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం.
ఏ జానర్ ఇష్టపడతారు?
కొలమానాలు లేవు. టైమ్‌లీ ఒక్కో జానర్‌లో ఒక్కో ప్రాజెక్టుతో ప్రూవ్‌చేసుకోవాలన్న ఆలోచన. పాయింట్ చిన్నదైనా రెండు గంటలు కూర్చోబెట్టగలిగే స్క్రీన్‌ప్లే ఇస్తే -ఆడియన్స్ జానర్ చూడరు. సినిమా చూస్తారు.
ఎల్ 7 స్పెషాలిటీ ఏంటి?
ఒకచోట 45 మినిట్స్ డైలాగ్ ఉండదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, లైటింగ్ బేస్ట్ స్క్రీన్‌ప్లే సీన్ అది. అలాగే, ఫస్ట్ఫాలో హీరో అరుణ్ ఆదిత్య, సెకెండాఫ్‌లో హీరోయిన్ పూజా జవేరి పెర్ఫార్మెన్స్ ఎక్స్‌ట్రార్డినరీ. సో, 21న థియేటర్స్‌కు వస్తోంది. చెప్పడంకంటే -థ్రిల్లర్, ఫాంటసీ, రొమాంటిక్ విజువల్ ఫీస్ట్‌ని చూసి ఎంజాయ్ చేయాలి.
ఇండస్ట్రీ సమస్యలు?
ప్రాజెక్టును అనుకున్నట్టు పూర్తిచేయడానికి మాకు మేం ఫేస్ చేసిన ప్రాబ్లెమ్స్ తప్ప, ఇండస్ట్రీ నుంచి ప్రాబ్లెమ్స్ లేవు. ఫీల్ హ్యాపీ విత్ గుడ్ వర్క్. ఎక్కడా కాంప్రమైజ్ కాని మా ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి మాకు పెద్ద దన్ను. బిగ్ థాంక్స్ టు హిమ్.
దర్శకుడంటే?
రెస్పాన్సిబిలిటీ. తన మైండ్ థాట్‌ను అనుకున్నట్టే ఆన్‌స్క్రీన్‌కు తెచ్చేందుకు 24 క్రాఫ్ట్‌ను ఇన్‌స్పైర్ చేసేవాడు.

-ప్రవవి