Others

మరుగుదొడ్డి ముఖ్యం అన్న యిల్లాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశమంతా స్వచ్ఛ్భారత్ పేరిట ‘టాయ్‌లెట్స్ ముఖ్యం’అన్న ఉద్యమం ఒకటి ప్రభుత్వ పూనిక మీద రేడియోలలోనూ, టి.వి.ల మీదా ఊదరగొట్టేస్తోంది. చాలాచోట్ల యిండ్లలో మరుగుదొడ్లు ప్రభుత్వ సహాయంతో నిర్మించుకున్న వాళ్లున్నారు. కానీ వాళ్లు ఎప్పుడోగానీ, యింట్లో మరుగుదొడ్లని వాడరు. వాటిని అలా వదిలి- ‘వెనుకటి గుణమేలమాను’ అన్నట్లు- హాయిగా ‘చెంబట్టుకుని’ వీధుల్లోకో, వూరు అవతలకో పోవడం యింకా సాగుతూనే వుంది.
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో వున్న ఒక యిల్లాలు మోదీగారంటే అపారమైన గౌరవం, అభిమానంగల స్ర్తిమూర్తి- వాళ్లింట్లో మరుగుదొడ్డి లేదు- బహిరంగ మలవిసర్జన అలవాటుని తప్పించుకోవాలీ అంటే- ‘‘ఘర్ మేఁటాయిలెట్ హోనా హై’’అని నిర్ణయించుకుంది గానీ శ్రీమతి లతాదేవి దివాకర్‌కి ఒక టాయ్‌లెట్‌ని నిర్మించుకోగల ఆర్థిక స్తోమతు లేదు. డబ్బులు కావాలి. ఒకర్ని ‘దేహీ’అని యాచించకుండా పైకం కావాలి. తన మెడ తడుముకుంటే బంగారు మంగళసూత్రం తగిలింది. పసుపుకొమ్ము తెచ్చుకుని- దాన్ని కట్టుకుని- మంగళ సూత్రాలు తీసి- అంగట్లో అమ్మేసి యింట్లో మరుగుదొడ్డిని కట్టించింది ఆ ఇల్లాలు. నిజానికి నాలుగువేల రూపాయల సహాయం అంటూ గవర్నమెంటు ‘‘హామీ’’ ఒకటి యిచ్చింది. కానీ, ‘‘అటువంటిదేమీ మాకు ఎంత ప్రయత్నించినా లభించలేదు’’- అంటూ దీనంగా జవాబు చెప్పిందామె. ఆవిడకో మంగళ సూత్రం కొనిపెట్టాలి ప్రతిపక్షాలైనా!-
యు.పి.లో యిలా వుండగా మధ్యప్రదేశ్‌లో కట్నీ జిల్లా అధికారులు విచిత్రమయిన నిబంధన పెట్టారు. ఎవరికైనా పాస్‌పోర్టు కావాలీ అంటే- అర్జీతోపాటు- ‘‘వీళ్లింట్లో మరుగుదొడ్డి సదుపాయం గలదు’’- అన్న సర్ట్ఫికెట్ కూడా జత చెయ్యాలిట! అయితే, రుూ ప్రమాణ పత్రం యివ్వాల్సింది పోలీసులు. ఏది ఎలావున్నా 2019నాటికి ‘చెంబట్టుకెళ్లడం’అన్న అలవాటు రూపుమాసిపోవల్సిందేనన్నదే మోదీ సర్కార్ ధ్యేయం! తథాస్తు!

veeraji.pkm@gmail.com