Others

చిరుదివ్వెల ధగధగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెలుగుల పండుగు దీపావళి దగ్గరకు వచ్చేస్తుంది. ఇంటిని అందంగా ముస్తాబు చేయటానికీ, వెరైటీ కొవ్వొత్తి దివ్వెలతో గదులను వెలుగులతో నింపేసేందుకు ప్రతి గృహిణీ ఆరాటపడుతోంది. మార్కెట్లో వచ్చే వెరైటీ ప్రమిదల కోసం అనే్వషణ ఆరంభించటం పరిపాటి. చిన్ని చిన్ని విద్యుత్తు దీపాలతో పాటు చిరు వెలుగులనిచ్చే క్యాడిల్ ప్రమిదలను ఏర్పాటుచేసుకుంటే ఇల్లు శోభాయమానంగా వెలుగొందుతుంది. దీపావళికి ఇంటిని ఆకర్షణీయంగా, అందంగా అలంకరించాలంటే కొంత శ్రద్ధ పెట్టాల్సిందే. గోడలకు పెయిటింగ్ వేయించాలని ఆరాటపడవద్దు. సింపుల్‌గా మార్కెట్లో అందమైన ఆకృతిలో లభించే స్టిక్కర్లతో ముస్తాబు చేసుకోవచ్చు. అలాగే వేలాడే అలంకరణ వస్తువులను కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. వాల్ పేపర్ల స్టెన్సిల్స్‌తో వివిధ డిజైన్లలో అతికించుకోవచ్చు. వీటికి పెద్ద ఖర్చు అవ్వదు. ఈ స్టెన్సిల్స్ కోసం ఓహెచ్‌పీ లేదా ప్లాస్టిక్ షీట్లను వాడతారు. నచ్చిన ఆకృతుల్లో స్టెన్సిల్స్‌తో వివిధ డిజైన్లు రూపొందించుకుని గోడలను అందంగా ముస్తాబు చేసుకోవచ్చు. ఇంటి ముందు ఆకర్షణీయమైన రంగోలి డిజైన్లు వేసుకుంటే పండుగకు ఇంటికి వచ్చే అతిథులకు స్వాగతం పలుకుతున్నట్లు వుంటుంది. గది మూలల్లో ఎక్కువ స్థలం నిరుపయోగంగా ఉంటుంది. ఈ స్థలాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందమైన లైటింగ్‌ను ఏర్పాటుచేసుకుంటే బాగుంటుంది. అందంగా ఉన్న తొమ్మిది కొవ్వొత్తి ప్రమిదల సెట్‌ను ఎంత చక్కగా పెయింట్ చేశారో చూడండి. బంగారం వర్ణంతో పాటు బహుళ రంగుల్లో గోటా లేస్‌తో డిజైన్ చేయటం వల్ల ఇల్లు రంగుల కాంతులు విరజిల్లుతోంది. ఆరెంజ్, పసుపు రంగుల్లో మెరిసే కొవ్వొతి దీపాల సెట్ కూడా ఇంటిని ప్రకాశవంతంగా చేస్తోంది. అందమైన మట్కీ శైలిలో ఉన్న ఈ దీపాల సెట్ అతివ తెలివితేటలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇంటికి ఎవరు వచ్చిన చాలా ఆసక్తిగా చూస్తారు. టెర్రకోటతో తయారుచేసిన ఈ బహుళ రంగుల దీపాల సెట్ మనసును సైతం ప్రభావిత చేస్తుందనటంలోఅతిశయోక్తి కాదు. పూల ఆకారంలో తయారుచేసిన ఈ అలంకరణ కొవ్వొత్తుల సెట్ ధగధగా మెరుస్తోంది. మరింకెందుకు ఆలస్యం గది గదినీ, మూల మూలను అందంగా అలంకరించండి.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03