Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. చెడు గుణంబులు మనదరిఁ జేరకుండ
నప్రమత్తతయుం గల్గి నడచుకొనగ
వలయు లేనిచోఁ దలవంపు భారమగును
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: చెడుగుణాలు మనలో కలగకుండా ఎంతోఅప్రమత్తతో నడచుకోవాలి. చెడుగుణాలు కానీ మనలో చేరితే అంతకుమించిన తలవంపు భారమై జీవితాలు దుర్బరవౌతాయని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈలోకానికి తెలియుజేయుమయ్యా దినకరా!

తే.గీ. వాగ్వివాదాలు పెట్టుకోవలదు వాటి
వలన మనసులు వ్రయ్యలై పడగనేమి
సుఖము గలదయ్య? యేల సంక్షోభమరయఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఎలాంటి పరిస్థితుల్లో వాగ్వివాదాలు పెట్టుకోవద్దు. వాటివల్ల మనసులు ముక్కలై పోతాయి. ఈ సంక్షోభం దేనికి? వాదోపవాదాల వల్ల సుఖమేముంది? కాబట్టి వాగ్వివాదాలు పెట్టుకోవద్దని కర్మసాక్షివైన ఓ సూర్యదేవరా! ఈలోకానికి తెలియజేయుమయ్య దివాకరా!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262