Others

పెట్టుడు పళ్లు రాత్రిపూట తీయాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓసారి ఓ అరవై ఏళ్ల ముసలతను తన పైదవడ బాగా నొప్పిగా వుందన్న బాధతో వచ్చారు. చూస్తే తనకి ఉన్నవి పైన కింద కట్టుడు పళ్లు, తీసి పెట్టుకునే రకం. ‘‘మీపై, కింద పళ్ల సెట్టు బయటికి తీయమని’’ నేనడిగిన ప్రశ్నకి తను పెట్టించుకున్న గత ఆరు సంవత్సరాలలో ఎప్పుడు వాటిని బయటకు తియ్యలేదని, రాత్రిళ్లు కూడా అవి పెట్టుకునే పడుకుంటానని ఇచ్చిన సమాధానానికి నేను ఖంగుతిన్నాను. అవి బయటకి తీసి చూస్తే పైదవడ అంగుడిపై పెద్ద పుండు, దవడకుండే చిగుళ్లు ఎర్రగా వున్నాయి. పుండు తగ్గేదాకా పళ్ల సెట్టు పెట్టుకోవద్దని హెచ్చరించా. రెండు వారాలు గడిచింది, మూడు వారాలు గడిచింది, పుండు తగ్గలేదు. మత్తు ఇచ్చి ఆ పుండుని కోసి పరీక్షకి పంపా. నా అనుమానం నిజం అయింది. అది కాన్సర్ అని తేలింది. తీసి పెట్టుకునే పళ్లు సరిగా చేయకపోయినా, అవి రాత్రిళ్లు తీయకపోయినా అది నొప్పి, పుండుకి దారితీస్తుంది. కొన్ని పుండ్లు క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది. చాలామంది ఇలా రాత్రిళ్లు పళ్ల సెట్టు బయటికి తీయకుండా పడుకుంటారు. ఇలా చెయ్యడం సబబు కాదు. సరైన అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
తీసి పెట్టుకునే పళ్లు అంటే ఏంటి?
అసలు నోట్లో పళ్లే లేని పెద్దవారిలో కొన్ని పళ్లు పుచ్చు లేక వేరే ఏ ఇతర కారణంగా తీసేసినా లేక పడిపోయినా వారు ఎక్కువ డబ్బు ఖర్చు చేయలేని సందర్భాలలో వీరికి తీసి పెట్టుకునే పళ్లు పెడతారు. ఈ పళ్లు దవడపై ఉండే చిగురు, పైదవడ అంగుడిని అంటుకుని వాటి మద్దతుమీద ఈ పళ్లు నోట్లో నిలబడతాయి.
వీటిని వాడే విధానం
ఏ తీసి పెట్టుకునే పళ్లయినా (మొత్తం పళ్లసెట్టయినా లేక కొన్ని పళ్లు వున్న సెట్టయినా) పొద్దున నోట్లో పెట్టుకుని రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా తీసేయాలి. అలా తీసేసిన పళ్ల సెట్టుని ఉప్పు నీరులో (బోరింగ్ నీళ్లు) కాకుండా మనం తాగే మంచినీళ్లలో ఉంచాలి. ఈ పళ్లని పొద్దునే్న తిరిగి పెట్టుకునే ముందు మనం స్నానం చేసే సబ్బుతో శుభ్రపరచుకోవాలి.
రాత్రిళ్లు ఎందుకు తీసేయాలి?
మీరు ఒరిసిన పుళ్లు (ఱళజూ ఒ్యళఒ) గురించి వినే వుంటారు. ఒక కదలలేని మనిషి మంచంమీద ఒకే పక్కకి పడుకొని ఉంటే ఆ పక్క చర్మంపై ఒత్తిడి ఎక్కువగా పెరిగి రక్తసరఫరా తగ్గి అక్కడ పుళ్లు వస్తాయి. వాటినే ఱళజూ ఒ్యళఒ అంటారు. అందుకే అపుడపుడు ఒక పక్కనుంచి మరోపక్కని మార్చడం కానీ, చర్మంపై ఎక్కువ ఒత్తిడి కలగకుండా వాటర్‌బెడ్ వాడడం కానీ చేయమంటారు. అదేవిధంగా మెత్తనైన చిగురుని అంటి ఉండే ఈ పళ్ల సెట్టు కూడా చిగురుమీద ఒత్తిడి కలిగిస్తుంది. రాత్రిళ్లు వాటిని నోట్లోంచి తీసేస్తే చిగుళ్లకి విశ్రాంతి కలిగి, తిరిగి రక్తసరఫరా పెరిగి చిగుళ్లు బలంగా ఆరోగ్యంగా వుంటాయి. అలా చేయని పక్షంలో చిగుళ్లకి రక్తసరఫరా తగ్గి పుండ్లు వచ్చే ప్రమాదం ఉంది.
ఈ పళ్ల సెట్టు తయారుచేయడానికి
ఎంత సమయం పడుతుంది
పూర్తి పళ్లసెట్టు అయితే సుమారు 8 నుంచి 10 రోజులు పడుతుంది. క్లీనిక్‌కి అయిదుసార్లు రావలసి వుంటుంది. అదేకొన్ని పళ్లు ఉన్న సెట్టు అయితే రెండుసార్లు క్లీనిక్ రావలసి వుంటుంది. నాలుగు రోజుల సమయం పడుతుంది.
పళ్లసెట్టు పెట్టుకున్న తరువాత పాటించాల్సిన నియమాలు
చాలాకాలం పళ్లు లేనివారికి పళ్ల సెట్టు పెడి తే వారికి అది అలవాటు కాడానికి రెండు మూడు వారాల సమయం పడుతుంది. ఇది అందరూ గ్రహించాల్సిన విషయం. పళ్ల సెట్టు పెట్టుకొని తినడం, మాట్లాడడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో చాలామంది సెట్టు బాగా కుదరలేదని పెట్టుకోవడం ఆపేస్తారు. నొప్పిగా, బాగా వదులుగా ఉంటే తప్ప దానిని వాడడం ఆపవద్దు. మూడు నాలుగు వారాలకి అదే అలవాటు అవుతుంది. పళ్ల సెట్టు పెట్టుకున్న మొదటి 3 లేక 4 రోజులలో ఎక్కడైనా గుచ్చుకొని నొప్పి పుట్టినా లేక పుండైనా ఆ సెట్టు వాడడం మాని మీ దంత వైద్యుణ్ణి సంప్రదించాలి. గుచ్చుకుంటున్న భాగాన్ని కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తారు.
నేటి దంత వైద్య చికిత్సా విధానంలో చిగుళ్లపై ఎక్కువ ఒత్తిడి కలిగించని పళ్ల సెట్లు వచ్చాయి. వీటిని స్ట్ఫా రీలైనింగ్ పళ్ల సెట్లు (ఒ్యచిఆ ళజశజశ జూళశఆఖూళఒ) అంటారు. ఇవి ఫెట్టించుకోవడం ఉత్తమం.
ఓ ముసలావిడ పళ్ల సెట్టుతో ఆడుతూ ఆడుతూ తన మనవడు కిందపడేస్తే అది విరిగిపోయింది. పళ్ల సెట్టు పెట్టుకోకపోతే గొంతులో ముద్ద కూడా దిగదు ఆవిడకి. చాలా బాధపడుతున్న బామ్మని చూసి ఆ మనవడు ఆ విరిగిన పళ్ల సెట్టుని గమ్‌తో అతికించి ఆవిడకిచ్చాడు. చాలా ఆనందపడి ఆ మనవడ్ని ముద్దు పెట్టేసుకొని, పళ్ల సెట్టు నోట్లో పెట్టి కొరికింది. ఫట్ అని మళ్లీ ఆ సెట్టు విరిగింది. ఆ పిల్లవాడు గమ్ పెట్టి అతికించడం, నోట్లో పెట్టుకొని కొరకగానే అది విరగడం, ఇదే తంతు కొన్ని రోజులు కొనసాగింది.
ఇలా కాదని ఆ పిల్లవాడు తన స్కూల్ పక్కనే ఉన్న మా క్లినిక్‌కి వచ్చి, విరిగిన ఆ పళ్ల సెట్టు అతికించమని ఇచ్చాడు. అతికించడం కుదరదు, మీ బామ్మని తీసుకొస్తే కొత్త సెట్టు చేస్తాం అన్నదానికి ఆ పిల్లవాడు ‘‘మా బామ్మకి విపరీతమైన మోకాళ్లనొప్పి, మంచంమీంచి లేచి కూర్చోలేదు. ఇంక క్లీనిక్‌కి ఎలా వస్తుంది. రాలేదు. అందుకే మీరు దానే్న అతికించి ఇచ్చేయండి’’ అని అన్నాడు. ఎంత కుదరదని చెప్పినా ఆ పిల్లవాడు మారాం ఆపలేదు. ఆ పిల్లవాడి దగ్గర కొత్త సెట్టు చేయించడానికి డబ్బులు లేవు. అందుకే నడవలేదు, రాలేదన్న సాకులు చెప్పాడు. ప్రభుత్వం వారు అరవై ఏళ్లు పైబడినవారికి ఉచితంగా ఈ పళ్ల సెట్టు చేయిస్తున్నదని, కాబట్టి పళ ల సెట్టు ఫ్రీగా చేయస్తామని చిన్న అబద్ధం చెప్పగానే వెంటనే బామ్మను తీసుకుని వచ్చాడు. ‘‘అబద్ధం చెప్పడం తప్పు కదా సార్’’ అంది మా జూనియర్ డాక్టర్. ‘‘కరెక్టే! ఉత్తినే చేస్తే అది అబద్ధం ఎందుకవుతుంది, నిజమే అవుతుంది’’ అన్నా. వెయ్యి అబద్ధాలు ఆడి ఓ పెళ్లి చేయమంటారు. ఆ పిల్లవాడు ఒక అబద్ధం ఆడి నా చేత ఓ అబద్ధం ఆడించి వాళ్ల బామ్మకో కొత్త పళ్ల సెట్టు చేయించుకున్నాడు. రాయిని అహల్యగా మార్చిన రాముడు దేవుడైతే నేనాడిన అబద్ధాన్ని నిజంగా మార్చిన ఈ పిల్లవాడు రాముడే మరి. యధృచ్చికం కాకపోతే ఆ పిల్లవాడి పేరు రాము.

-డా. రమేష్ శ్రీరంగం,
సర్జన్, ఫేస్ క్లినిక్స్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్

సెల్ నెం: 92995 59615 faceclinics@gmail.com

-డాక్టర్ రమేష్ శ్రీరంగం