AADIVAVRAM - Others

న్యాయమా.. నీవెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పది మంది అపరాధులు శిక్ష నుండి తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడరాదన్న నిబంధన మేరకు న్యాయ వ్యవస్థ ముందుకు సాగుతుంది. తన పర బేధం ఉండదన్న నానుడితో న్యాయ దేవత కళ్లకు గంత కట్టారని పూర్వం చెప్పేవారు. నేడు ఆ అర్థం పోయి న్యాయదేవతకు కళ్లు లేవు. చూడదనే భావార్థం నేటి ప్రజలకు ఉంది. న్యాయ వ్యవస్థ సక్రమంగా కృషి చేయగలిగితే దేశం, సమాజం లక్షణంగా ముందుకు సాగుతుంది.
న్యాయ వ్యవస్థపై పూర్వమున్న గౌరవం, భక్తి ప్రస్తుతం లేవన్నది వాస్తవం. నాపై కేసు పెట్టారా, ఈ కోర్టు కాకుంటే ఆ కోర్టు, ఆ కోర్టు కాకుంటే మరో కోర్టు, చివరగా ఢిల్లీ పెద్ద కోర్టుంది. నా కేసు తెగి తెల్లారేసరికి ఏ 20 లేక 30 సంవత్సరాలు పడుతుంది. భయమెందుకు అనే అభిప్రాయం ప్రజలకెలా వచ్చిందో, ప్రభుత్వాలు, న్యాయశాఖ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాదంటారా? ఎవరైనా దావా (వాటాల కోసం, హక్కు కోసం, విక్రయ ఖరారు కోసం) దాఖలు చేస్తే కింది కోర్టులో ఆ కేసు తెగేసరికి దాదాపు 8 సంవత్సరాలు పడుతుంది. ఆ దావాపై అప్పీలు 3 లేక 4 సంవత్సరాలు పడుతుంది. అంటే సారాసగటున ఓ సివిల్ చిన్న కేసు పూర్తికావటానికి (2 కోర్టులలో మాత్రమే) పది సంవత్సరాలు పడుతుంది. ఆర్థిక స్థోమత కలవారు, ఆవలి పార్టీని ఇబ్బందులు పెట్టాలి, సతాయించాలనుకున్న పార్టీలు హైకోర్టుకు, సుప్రీం కోర్టు వరకు వెళతారు. అంటే కేసును సముద్రంలో వేసినట్లే. ఆ కేసు ఎన్నాళ్లకు (సంవత్సరాలకు) తెగుతుందో న్యాయవాదులు, న్యాయమూర్తులు సైతం చెప్పలేరు.
మనం న్యాయ వ్యవస్థ తీరుతెన్నులు పరిశీలిద్దాం. న్యాయ వ్యవస్థను కించపరచడం, విమర్శించడం నేరమని చట్టం చెబుతుంది. కానీ న్యాయ వ్యవస్థను గురించి ఇది విమర్శ కాదు. లోపాల సవరణ కోసం చూపిస్తున్నట్లే. మన దేశంలో పది సంవత్సరాలు దాటినా నానిపోయిన కేసులు చూద్దాం. ‘‘రాజీవ్ గాంధీ హత్య కేసు, ఇందిరాగాంధీ హత్య కేసు, లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కేసు, భోఫోర్స్ కుంభకోణం కేసు, జయలలిత అక్రమాస్తుల కేసు, జగన్ అక్రమాస్తుల కేసు, ఉగ్రవాది కసబ్ కేసు, అయేషా కేసు, నిర్భయ కేసుల గురించి ప్రభుత్వాలకు న్యాయ శాఖకు, దేశ ప్రజలకు తెలియంది కాదు. ఎన్ని సంవత్సరాలు పట్టిందో, ఇంకా పడుతుందో మనం చూడవలసిందే. నోరెత్తితే కోర్ట్థుక్కరణ నేరమంటారు. తప్పునెత్తి చూపిస్తే నేరమా? బ్రిటీష్ కాలం నాటి చట్టాలు మనకింకా అవసరమా? జనాభా ప్రాతిపదికన, నేటి పరిస్థితులకనుగుణంగా సరికొత్త చట్టాలు (దిశ చట్టంలా) రూపొందించలేరా? న్యాయ వ్యవస్థ నత్తనడకకు కారణములేంటి? పోలీసుల నిర్లక్ష్యమా? న్యాయవాదుల సరళియా? తగినన్ని కోర్టులు, న్యాయమూర్తులు లేకపోవడమా? ఎందకింత జాప్యం జరుగుతుంది? ప్రేమించలేదని ఓ అమ్మాయిపై యుకుడు యాసిడ్ దాడి చేస్తే లండన్ కోర్టు ఆరు నెలల్లో కేసు ముగించి, నేరస్థునికి జీవిత ఖైదు విధిస్తూ, సింగిల్ చీకటి గది (పెరోల్ సైతం లేకుండా)లో మరణించే వరకుంచాలని తీర్పు చెప్పింది. సౌదీలో అలా యాసిడ్ దాడి చేసిన యుకునికి అదే యాసిడ్ వాడి కళ్లలో పోయమని మూడు నెలల్లో కోర్టు తీర్పునిచ్చింది. మనం ప్లాస్టిక్ నిషేధమని దేశమంతా నినాదం చేస్తూ ప్లాస్టిక్ వినియోగిస్తూనే ఉన్నాం.
తమలపాకులు వేసుకుని ఎక్కడంటే అక్కడ ఉమ్మివేస్తున్న ప్రజల కోసం, పరిశుభ్రత కోసం సౌదీలో ‘‘తమలపాకు ఎక్కడ కనిపించినా ఎవరి వద్ద ఉన్నా పది సంవత్సరాలు జైలుశిక్ష అని చట్టం చేసింది. అంతే దేశంలో ఎక్కడా ఎర్రని ఉమ్మి కనిపించలేదు. చట్టాలు, శిక్షలంటే అలా ఉండాలి. చట్టమంటే నేరుస్థుల మదిలో వణుకు పుట్టాలి. భయం కలగాలి. అలాంటి చట్టాలకు తీర్పులకు మన దేశం (న్యాయవ్యవస్థ) ఇంకా ఆమడదూరంలో ఉంది. అందువలన నేడు న్యాయవ్యవస్థను ప్రక్షాళణ చేయాలి. వేగవంతం చేయాలి. చట్టాలు మార్చాలి. కోర్టులపై ప్రజలకు గౌరవ భావం పెరిగేలా పలు మార్పులు చేయాలి. న్యాయ వ్యవస్థను ముందుకు నడిపించాలి. చనిపోయిన మనిషికి పోస్ట్‌మార్టం అవసరమా? సివిల్ వ్యాజ్యాలతో తప్పుచేసిన వారికి శిక్షలు వేయరా? నేరస్థులను సంవత్సరాల కొద్దీ ప్రభుత్వ ధనంతో మేపవలయునా? లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఉద్యోగులకు బెయిల్ అవసరమా? సస్పెన్స్ చేస్తే సరిపోతుందా? అనేది స్పాట్ శిక్ష వేసే చట్టం చేయలేరా? (అవినీతిపరులు తిరిగి ఉద్యోగంలోకి ఎలా వస్తున్నారు? కోర్టు విలువైన సమయాన్ని వృధా చేస్తూ వేస్తున్న కేసులను, కేసులు వేసే వారిని తగిన రీతిన శిక్షించలేరా? నిర్భయ కేసుకు ఆ కోర్టు, ఈ కోర్టు, ఉరిశక్ష అంటూ దోబూచులాడడం వల్ల ప్రజలకు కోర్టులపై గౌరవం తగ్గదా? న్యాయ వ్యవస్థ కేసుల విచారణను వేగవంతంగా కృషి చేయాల్సి ఉంది. శిక్షలు వెనువెంటనే అమలుజరిగేలా చట్టాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత లేదా ఆలోచించండి!

-మురహరి ఆనందరావు