Others

బహుజన రాజ్యాధికార మార్గదర్శి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనేక సంవత్సరాలుగా మానవ హక్కులకు దూరంగా ఉంచబడిన పీడిత జనులను విముక్తిచేయడానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తన జీవితం చివరి వరకు కృషిచేస్తే, ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని మరణించేవరకు పోరాడిన గొప్ప యోధుడు కాన్షీరామ్. పీడిత జనులను పాలకులుగా చూడాలనుకున్న అంబేద్కర్ కలలను నిజం చేసినవాడు కాన్షీరామ్. ఆరు దశాబ్దాల భారతదేశ రాజకీయాలను ఒక మలుపుతిప్పి ఆధిపత్య కులాల పెత్తనాన్ని నిరోధించడానికి బహుజన కులాలను సమీకృతంచేసి పీడిత కులాలకు రాజ్యాధికార రుచిని చూపించినవాడు కాన్షీరామ్.
పంజాబ్ రాష్ట్రంలోని రోఫార్ జిల్లా, కావాస్‌పూర్ గ్రామంలో 1934 మార్చి 15న జన్మించాడు. తండ్రి హరిసింగ్, తల్లి బిషన్‌సింగ్ కౌర్. కాన్షీరామ్ చిన్నప్పటినుంచి క్రమశిక్షణ కలిగి ఉండడం, స్వాభిమానం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం కలిగి ఉండేవాడు. చదువులోను ముందుండేవాడు. 1956లో డెహ్రాడూన్ స్ట్ఫా కాలేజీలో ఉన్నత విద్యాభ్యాస శిక్షణ అనంతరం డెహ్రాడూన్‌లోని భారతీయ వైజ్ఞానిక సర్వే విభాగంలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1959లో పూనేలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిలటరీ ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థలో పరిశోధన అధికారిగా నియమితులయ్యారు ఒక రామదాసీ చమర్ కులంలో పుట్టి సైంటిస్ట్‌గా ఎదిగి తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న అసమాన్య వ్యక్తి కాన్షీరామ్. అంబేద్కర్ గురించి తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించిన ఆయన అంబేద్కర్ సామాజిక, రాజకీయ జీవితాన్ని లోతుగా అధ్యయనం చేశారు. 1963లో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిలటరీ ఎక్స్‌ప్లోజివ్స్‌నందు పనిచేస్తున్న కాలంలో దీనాబానా అను నాల్గవ తరగతి ఉద్యోగిని బర్తరఫ్ చేయడాన్ని కాన్షీరామ్ తీవ్రంగా ప్రతిఘటించి ఆందోళన ప్రారంభించారు. ఆయన చేసిన చట్టబద్ధ పోరాటంవల్ల దీనాబానాను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం జరిగింది. అదే విధంగా ఒక దళిత స్ర్తిని ఉద్యోగంలోకి తీసుకోవడానికి వివక్ష చూపుతుంటే ఆయన ఉద్యోగంలోకి చేర్చడానికి పోరాటం జరిపారు. ఈ రెండు ఘటనలు కాన్షీరామ్‌లో పోరాటం స్ఫూర్తిని నింపాయి. తమ జాతి జనులకు ఏదో చేయాలనే తపన పెరిగింది. అంబేద్కర్ నడిపిన ఉద్యమాలను, గ్రంథాలను శోధించడం, పరిశీలించడం ప్రారంభించిన కాన్షీరామ్ అంబేద్కర్‌తోపాటు మహాత్మ జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి వంటి నాయకుల పోరాటాలను అధ్యయనం చేశారు. పీడిత ప్రజలు కులాలుగా, ఉపకులాలుగా విడిపోయి ఉండటంవల్ల రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని, ఈ చిన్నచిన్న సమూహాలను బహుజన సమూహంగా మారిస్తే అధికారం చేజిక్కించుకోవడం సాధ్యమవుతుందని గ్రహించిన కాన్షీరాం దోపిడి వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని, ప్రజలను చైతన్యంచేయాలని దృఢ సంకల్పానికి వచ్చాడు. కుల ప్రాతిపదికన అస్తవ్యస్తంగా ఉన్న సమాజాన్ని మార్చడానికి, నిజాయితీతో కూడిన సమరశీల శక్తిగా ఎదగడానికి బ్రహ్మచర్య పాటించాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. విద్యార్థులను, ఉద్యోగులను పోగేసి మీటింగులుపెట్టి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వారితో పంచుకునేవాడు. కాన్షీరామ్ ఆలోచనా విధానాన్ని నచ్చిన ఉద్యోగులు కాన్షీరామ్ వెంట నడవడానికి సిద్ధపడ్డారు. బోధించు, పోరాడు, సమీకరించు అనే నినాదంతో 1978, డిసెంబర్ 6న ‘బామ్‌సెఫ్’ను స్థాపించాడు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఉద్యోగులను ఏకంచేసి దోపిడీకి గురవుతున్న తమ జాతి ప్రజల రుణం తీర్చుకోవడమే ధ్యేయంగా ఏర్పడింది. ‘పే బ్యాక్‌టు సొసైటీ’అనే నినాదంతో సమాజానికి విద్యావంతులైన ఉద్యోగులు తమ మేధస్సును, డబ్బును, ప్రతిభను అందించాలని కాన్షీరామ్ కోరారు. యువతను చైతన్యపరుస్తూ కాశ్మీరునుండి కన్యాకుమారి వరకు సమానత్వం కోసం సైకిల్ ర్యాలీ నిర్వహించి బాబాసాహెబ్ ఆశయ సాధకుడిగా చరిత్రలో నిలిచాడు. ‘‘మన టిక్కెట్లు మనమే ఇచ్చుకుందాం మన ఓటు మనమే వేసుకుందాం’’ అనే ఉద్దేశంతో 1982లో హర్యానా, ఢిల్లీ, పంజాబ్, కమ్మూకాశ్మీర్ ఎన్నికలలో దళిత్ సోషిత్ సమాజ్ సంఘర్షణ సమితి పాల్గొని పోటీచేసిన పార్టీలలో నాలుగవ స్థానాన్ని సాధించింది. ఎన్నికలలో బహుజనులు పూర్తిగా మద్దతు తెలిపారు. బహుజనులకు ఒక రాజకీయ పార్టీ అవసరాన్ని తెలుపుతూ ప్రచారం చేశాడు. 1984 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతినాడు లక్షలాది ప్రజల ముందు కాన్షీరామ్ పార్టీ పేరు బహుజన సమాజ్ పార్టీ, ఎన్నికల గుర్తు ఏనుగును ప్రకటించాడు. ఫులే ఉద్యమంనుండి బహుజన సమాజ్ పేరును, అంబేద్కర్ ఉద్యమం నుండి నీలి జెండా, ఏనుగు గుర్తును తీసుకున్నట్లు ప్రకటించారు. 1984నుండి జరిగిన ఎన్నికలలో బిఎస్పీ తన అభ్యర్థులను నిలబెడుతూ జాతీయ పార్టీలకు గట్టి పోటీని ఇస్తూ ముందుకుసాగింది. 1989లో బిఎస్పీ ఉత్తరప్రదేశ్‌లో రెండు లోక్‌సభ, 13 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంది. 1993 ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో బిఎస్పీ, ఎస్పీ సంకీర్ణ కూటమి విజయం సాధించి ములాయంసింగ్ ప్రభుత్వంలో బిఎస్పీ సభ్యులు మంత్రులుగా ఉండడం దేశ ప్రజలను ఆశ్చర్యంలోకి నెట్టడమే కాక బ్రాహ్మణీయ శక్తులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
బహుజనులు ఓటును పదునైన ఆయుధంగా వాడి అధికారంలోకి రావాలి అని, పదవులు ముఖ్యంకాదు బహుజన సమాజ నిర్మాణమే నా కర్తవ్యం అని, రాజ్యాధికారం ద్వారానే బహుజనులకు భద్రత ఉంటుందని కాన్షీరామ్ చెప్పేవారు. అక్టోబర్ 9, 2006న కాన్షీరామ్‌కి తీవ్రమైన గుండెపోటు రావడంతో అదేరోజు రాత్రి మరణించారు. అంబేద్కర్ తర్వాత ఆయన వదిలివెళ్లిన ఉద్యమ స్ఫూర్తిని భుజాలకెత్తుకొని అణగారిన ప్రజలకోసం పోరాడిన వ్యక్తి మాన్యశ్రీ కాన్షీరామ్. మనువాద రాజకీయ పార్టీలను, నాయకులను ఎదుర్కొని భారత రాజకీయాలలో తనదైన ముద్రవేసిన ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని బలహీనవర్గాలు, పీడిత వర్గాలు ఆయన వేసిన పునాదులను ఆసరాగా చేసుకొని రాజ్యాధికార దిశగా కృషి చేయాల్సి ఉంది.

- వాసిలి సురేష్, 9494615360