Others

ఉపకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపకారం చేసినవాడికి ఉపకారం చేయమని మన పెద్దలు చెబుతుంటారు. అపకారం చేసిన దోషిని క్షమించడమే వానికి పెద్దశిక్ష అని కూడా అంటుంటారు. దీనికి సంబంధించిన ఓ కథ మహాభారతం లో కనిపిస్తోంది. దాన్ని చూద్దాం.
గౌతముడు అనే బ్రాహ్మణుడు స్వధర్మం విడిచి చెడు సావాసాలకు లోనై ఒక బోయ వనితను వివాహం చేసుకున్నాడు. మాంసభక్షణ చేస్తూ మద్యం సేవిస్తూ వాటికోసం దుర్మార్గాలు చేస్తూ డబ్బు కోసం అడవిలో వర్తకులతో తిరుగుతుండేవాడు.
ఒకనాడు అరణ్యంలో వెళ్తుండగా వానిని ఒక మదపుటేనుగు తరమగా అతను దారి తప్పి అలసటతో ఒక మర్రిచెట్టు క్రింద దాగున్నాడు. ఆ మర్రిచెట్టు నాడీజంఘడు అనే బకము నివాసం ఉండేవాడు. ఆ నాడీజంఘుడు బ్రహ్మకు మిత్రుడు. గొప్ప ధార్మికుడు. ఆ నాడీజంఘుడు అలసి ఉన్న ఆ బ్రాహ్మణుని అతిథిగా తలచి గౌరవించి భోజనం ఏర్పాటుచేసి అతని కథ విని జాలిపడి ‘‘స్వామీ నా వద్ద ధనం లేదు, నా మిత్రుడు విరూపాక్షుడనే దనుజుడు మధువ్రజపురంలో ఉన్నాడు. వానివద్దకు వెళ్ళు, నీకు ధనమిస్తాడు’’ అని చెప్పాడు.
ఆ బ్రాహ్మణుడు మధువజ్రపురం వెళ్లి విరూపాక్షుని కలిశాడు. వీనిని చూడగానే విరూపాక్షుడు వీడు పరమ దుర్మార్గుడు, నీచుడని గ్రహించాడు. ధనమివ్వదల్చుకోలేదు. కారణం నీచులకు ఉపకారం చేస్తే అది అపకారమే అవుతుంది. పాముకు పాలు పోసి పెంచితే అది మరింత విషాన్ని వృద్ధి చేసుకొని కాటువేస్తుంది అని నీతిశాస్త్రంలో చెప్పినట్లుగానే మూర్ఖుడికి, దుర్మార్గులకు ధనం లభిస్తే సజ్జనులను బాధపెడతారు. కనుకనే వారికి ధనమీయకూడదు అని విరూపాక్షుడు అనుకున్నాడు. కానీ తన మిత్రుడు బాధపడు తాడేమోఅని ఆలోచించి వద్దనుకుంటూనే ఈ బ్రాహ్మణునికి విరూపాక్షుడు ధనమిచ్చి పంపాడు.
విరూపాక్షుడు ఇచ్చిన ధనం తీసుకుని ఆ బ్రాహ్మణుడు తిరుగు ప్రయాణంలో ఎండ వేడికి నాడీజంఘుడు నివాసమున్న మర్రిచెట్టు నీడను విశ్రమించాడు. వాని శ్రమను చూసి నాడీజంఘుడు ఆ బ్రాహ్మణు అలసట తీర్చడానికి తన రెక్కలతో కాస్సేపు విసిరి తాను కూడా కాసేపు నిద్రపోయాడు. ఆ బకం శరీరం బాగా కొవ్వు పట్టి ఉండడం చూసి ఆ బ్రాహ్మణుడు గాఢ నిద్రలో వున్న దానిని చంపి మాంసం తిన్నాడు.
మరునాడు యథాప్రకారంగా నాడీజంఘుడు తన వద్దకు రాకపోవడం చూసి కారణం తెలుసుకొని రమ్మనమని విరూపాక్షుడు దూతలను పంపాడు. వారు వచ్చి విషయం తెలుసుకొని విరూపాక్షునికి చెప్పారు. పైగా ఘోరం చేసింది ఆ బ్రాహ్మణుడిలాగా ఉందని విషయం కూడా వారు చెప్పారు. విరూపాక్షుడుఆ బ్రాహ్మణుడిని పట్టి బంధించి తెమ్మనమని తన భటులను ఆజ్ఞాపించాడు. వారు వెళ్లి బ్రాహ్మణుని బంధించి తెచ్చారు. విరూపాక్షుడు వెంటనే ఈ దోషిని సంహరింఛి కుక్కలకు వేయమని చెప్పాడు. సభలో ఉన్న పెద్దలు వీని మాంసం కుక్కలు కూడా అంగీకరించవు.ఎందుకంటే వీడు కృతఘు్నడు, దుర్జనుడు. తేలుకి విషం తోక కొండిలో ఉంటుంది, ఈగకు విషం తలయందు ఉంటుంది, పాముకి విషం కోరలయందు ఉంటుంది, దుర్జనునికి అన్ని అవయవాల్లోనూ విషముంటుంది.
అపుడు విరూపాక్షుడు ముందుగా తన మిత్రునికి అంత్యక్రియలు జరిపిద్దామని మిత్రుని కళేబరాన్ని చితిపై పెట్టి నిప్పు అంటించబోయాడు. అపుడు ఆ సమయంలో ఇంద్రుడు అటుగా రావడం చూసి తన మిత్రుడిని బ్రతికించమని పార్థించాడు. ‘‘ఈ నాడీజంఘుడు బ్రహ్మకు చెలికాడు, అందువల్ల వీనిని బ్రహ్మ తీసుకొనిపోయాడు’’ అని చెప్పాడు ఇంద్రుడు. ఆ చితికి సమీపంలో సురభి తన దూడకు పాలిస్తుండగా ఆ దూడ మూతినుండి పాలనురుగు గాలికి ఎగిరివచ్చి చితిమీద పడింది. దాంతో నాడీజంఘుడుకి ప్రాణం తిరిగివచ్చి లేచాడు. అదంతా బ్రహ్మదేవుని ప్రభావం అనివారుఅనుకున్నారు.
నాడీజంఘుడు బ్రాహ్మణుడు బధించబడి ఉండడం చూసి వానికి విధించబడిన శిక్ష తెలుసుకొని వానిని క్షమించి విడిచిపెట్టమని వారిని ప్రార్థించి వానిని విడిపించాడు. అంతేకాదు ఆ బ్రాహ్మణుడికి ధనమిప్పించి పంపాడు నాడీజంఘుడు. తనుచేసిన ఉపకారం విస్మరించి తన ప్రాణం తీసిన కృతఘు్నడిని క్షమించడమే గాక వానికి ధనమిప్పించి పంపిన నాడీజంఘుడు ఆదర్శప్రాయుడయి చరిత్ర పుటల్లో నిలిచాడు.
ఇలా ఎవరైనా చరిత్రలో నాలుగు కాలాలపాటు మనలను తలుచుకోవాలి అంటే మంచి పనులే చేయాలి కానీచెడు పనులు చేస్తే బతికుండగానే అందరూ వెలివేస్తారు.

- ఆర్.పురందర్