Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. సూర్యదేవర! నీ నామ శూలఘాత
ములకు ఁ గులాశే 3వైరసుమూక2 లొక్క
పెట్టునం జోద్యముంగాదు విశ్వమందుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: కర్మసాక్షివైన ఓ సూర్యనారాయణమూర్తీ! స్వామీ! నీ నామమనే శూలఘాలకు వైరసు మూకలన్నీ ఒక్కసారిగా కూలిపోతాయనడంలో ఆశ్చర్యపడవలసిన దంటూ ఏమీ లేదుగా ప్రభాకరా!

తే.గీ. అంటుజాడ్యమియ్యది యంటునంచు ఁ దలుప
నీ కరోన వైరసు భ యమెక్కువాయి
దిక్కుతోచని స్థితిలోన దేవులాడు
భూజనాళిని ఁగావుమో పూజనీయ
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: దిక్కుమాలిన కరోనావైరస్ అంటురోగం కదా. ఎక్కడ అంటుకుంటుందో నని భయంతో దిక్కుతోచని స్థితిలో ఏదో ఒక దిక్కు కోసం వెతుకులాడే భూజనాలను కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! కాపాడుమయ్య స్వామీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262