Others

మానవుడే మహనీయుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరామాయణం కేవలం ఒక అవతారపురుషుడి జీవిత చరిత్ర కాదు. మానవ జీవన విధానానికి దర్పణం. అద్దంలో మన ముఖం మనం చూసుకోవచ్చు. లోపాలను సరిదిద్దుకొని మరింత అందంగా తయారుచేసుకోవచ్చు. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఆది కవి వాల్మీకి మహాకావ్య రూపంలో శిల్పీకరించి మానవాళికి మహోపకారం చేశాడు.
అటు దేవతలు, ఇటు రాక్షసులు క్షీరసాగర మథనం సాగించి అమృతం వెలికితీశారు. దేవతలు ఆ కలసాన్ని స్వాధీనం చేసుకుని అమరులయ్యారు. అప్పటినుంచి దాయాదులమధ్య పగల సెగలు రగిలి దేవ దానవ యుద్ధాలకు దారితీశాయి. అమృతం దక్కించుకోలేని దానవులు దాయాదులపైన పగ సాధించడానికి తపోబలంతో వరాలుపొంది, స్వర్గలోకంతోపాటు మిగతా లోకాలను అల్లకల్లోలం చేశారు.
హిరణ్యకశిపుని చంపడానికి శ్రీమహావిష్ణువు సగం మృగం- సగం మనిషిగా మారవలసి వచ్చింది. త్రేతాయుగంలో రావణ సంహారం కోసం స్వామి రాముడై దిగిరావలసి వచ్చింది. రాక్షసులకు దేవతలు తప్ప మనిషితో ప్రత్యక్ష వైరం లేదు. అందుకే రావణుడు మనిషిని తన వరాల జాబితాలో నమోదు చేయలేదు. మనిషికి జనన మరణాలు సహజ పరిణామాలు. అవి అతడి పాలిట ఒక మహోపకారంగా మారింది. శరీరం వదిలినా కీర్తి శరీరంతో చిరకాలం మనగల అవకాశం దక్కింది. ధృవ మార్కండేయుల వంటి మహర్షులు చిరంజీవులై మానవుడే మహనీయుడు అన్న నానుడికి సజీవ ప్రతీకలుగా నిలిచారు. శిబి, దధీచిలు త్యాగధనులై చరిత్రలో శాశ్వతమైన స్థానాన్ని పొందగలిగారు. రావణుడి హింసలను తట్టుకోలేక దేవతలు, ఋషులు శేషతల్పశాయిని ప్రార్థించారు. మానవుడిగా అవతరించి వారి కష్టాలు కడతేర్చగలనని మాట ఇచ్చాడు శ్రీకాంతుడు.
కోసల దేశానికి తలమానికమైన అయోధ్యానగరంలో ఇక్ష్వాకు వంశజుడైన దశరథ మహారాజుకు తనయుడై జన్మించాడు రాఘవుడు. పుత్రకామేష్ఠి తరువాత ఒక ఏడాది గడిచింది. చివరి 12వ నెలలో చైత్ర శుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్ర యుక్త కర్కాటక లగ్నాన నాలుగో పాదాన కౌసల్యా గర్భంలో జన్మించాడు దాశరథి. ఆ సమయంలో సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని ఈ ఐదు గ్రహాలు ఉచ్ఛస్థానంలో ఉన్నాయి. మేషంలో సూర్యుడు, మకరంలో అంగారకుడు, కర్కాటకంలో గురుడు, మీనంలో శుక్రుడు, తులారాశిలో శనీశ్వరుడు కొలువుతీరి వున్నారన్నమాట. నలుగురు అన్నదమ్ములు- రామ, లక్ష్మణ, భరత, శతృఘు్నలు- వశిష్ఠ మహర్షి గురువుకు శిష్యులయ్యారు. రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి నేతృత్వంలో రాక్షస సంహారానికి బయలుదేరారు.
మానవ సంబంధాలు ఎలా వుండాలో తెలుసుకోవడానికి రాముడి జీవితమే ఒక ఉదాహరణ. తండ్రి మాటను నిలబెట్టడానికి, రాజ్యం వదిలి సీతా లక్ష్మణ సమేతంగా అడవికి వెళ్లాడు. 14 సంవత్సరాలు నార బట్టలతో, ప్రకృతి ఒడిలో నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు. మనిషి ఎలా ఋషి కాగలడో నిరూపించాడు. మనిషికి జీవితం పాఠశాల. అనుభవాలు పాఠాలు. ఆదర్శాలు జీవిత పరమార్థాలు. వాటిని ఎలా ఉపయోగించాలో మనకు చక్కగా తెలియబరిచారు. 16 కళల పూర్ణచంద్రుడై, సత్య ధర్మ పరాక్రమాల మధ్యందిన మార్తాండుడై వెలిగాడు. ఇహ పర సాధన మనిషిని భావజలధిని దాటించి మోక్ష గమ్యాన్ని చేరటానికి అనువైన ఉపకరణం అంటుంది రామాయణం. మనలాంటి మానవుడు రాముడు కాబట్టి, మనకు రాముడంటే ఇష్టం. మానవజన్మ చవిచూసిన రాముడికి మనమంటే ఇష్టం! నేను మనిషిని- ‘ఆత్మానాం మనుష్యాం మనే్వ’ అని స్పష్టంగా చెప్పాడు. రామజన్మభూమిలో మనం పుట్టడం మన అదృష్టంగా భావించాలి.

-నిరామయ