Others

మనుచరిత్ర ప్రబంధ దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

3. దేవతలనే గడగడలాడించిన బ్రహ్మచర్య తపోదీక్షా పరాయణుడా! అంటే పుంజికస్థలని చూసి ‘‘అనంగ గ్లాని బడి కదిసి వడకుచు హీనస్వర మెస*గ బ్రోవవేనన్నని’’ న ‘‘పంచశరకాండ విఖండిత ధైర్యసారు*డు’’ మాత్రం కాడు. (వైరాగ్యమున జేసి) కాంక్షసేయు జారకామినులకు భోగబాహ్యుడు అన్నంత చక్కని వాడు. కౌతుక శ్రీ విధి కూకటుల్గొలిచి చేసిన కూరిమి సోమిదమ్మతో కాపురం చేసుకొంటున్న గృహస్థు. దిక్కు తోచని చోట వరూధిని అనే అప్సరస స్వయంగా వలచి వచ్చి ‘మత్కాంతార సంతానాల్లో భోగపరుడవయి రమింపుము నన్నుగూడి’ అన్నా చలింపని ఇంద్రియ నిగ్రహం కలవాడే కాదు, తాను నిత్యోపాసన చేస్తున్న అగ్నిదేవుని ‘పరతంత్రుడనేని, భవత్పదాంబుజ ధ్యానరతుండనేని, పరదార ధనాదుల*గోరనేని’ అని ఒట్లుపెట్టి ఇంటికి చేర్పమని నిలదీయగలవాడు. కనుకనే ఆ మహీదేవుని దేహమున సన్నిహితుడై అగ్ని ఆయనని ఇంటికి చేర్చింది!
అలా అక్కడా అక్కడా ఒక్కొక్కరూ ఒక్కొక్క విషయంగా (శాపనిందా విషయికంగా) అల్పాల్ప సిద్ధులు పొంది, వైదిక సామాన్య మార్గంలో నడచుకొనే ఒక సామాన్య గృహస్థు ముందు తేజం కోల్పోయిన వాళ్లవుతారు. ఆ గృహస్థు స్వమార్గంలో ‘తేజోసాధన చేయాలంటే ఇలా ప్రవర్తింప వలసి ఉంటుంది’ అని పెద్దనార్యుడు ఎప్పటికీ హరించి పోని వస్తుతత్వతైలం నింపి, ప్రవరాఖ్య పాత్రలో, గుణశీల వర్తనల పేనిన అఖండ వర్తిని, తన చతురవచోదీప్తిని వెలిగించి, చదివినవారి మనస్సుల్లో కొడిగట్టటమే ఎఱుగని ‘ఆదర్శ దీపకళిక’ నిలిపి వైదిక అచంచల సూత్రబల గార్హస్థ్య సామాన్య జీవనకాంతి పుంజాలతో ప్రబంధం అంతటా జిలుగు వెలుగులు చిమ్మేటట్లు చేసాడు.
చివరి మాటగా, ప్రబంధం ఆంధ్ర కవితాపితామహుడు మన సాహిత్య వ్యవసాయ క్షేత్రాన పండించి ఇచ్చిన క్రొత్తపంట. ఇంక అధ్యయన క్షుధార్తులై ఎప్పటికప్పుడు వస్తూండే విద్యార్థ్యతిధ్యభ్యాగతులను శశ్వదమృతాక్షర సస్యసమృద్ధి కలిగి, శిరీష కుసుమపేశల సుధామయోక్తుల చతుర వచోభోజ్యంబు లవ్వారిగాగ, వ్యంజనాస్వాద రసపుష్టితో అతుల పురాణాగమేతిహాస కథార్థ స్మృతియుత పాకం కుదిరిన ఇష్టమృష్టాన్నకలన సత్య సంతుష్టిగా నిత్య సంతర్పణలు వడ్డించే అన్నపూర్ణా కర పవిత్ర పాత్రంగా మనుచరిత్రం ఇంపై కలి జాడ్యం పోగొట్టి, ఆరోగ్యామరత్వాలు అందించే ఆదర్శంతో ప్రవర్తించటం ఆంధ్రుల అదృష్టం. అది అందరికీ దక్కాలి. అందుకు ఇదో మాదిరి ప్రయత్నం.
‘‘పరస్పరవిరోధిన్యో రేకసంశ్రయ దుర్లభమ్
సంగతం శ్రీ సరస్వత్యోః భూయాదుద్భూతయే సతామ్’’(కాళిదాసు విక్రమోర్వశీయ భరతవాక్యం)
ఒండొరుల సరిపడని వాటిని ఒకచోట నిలపటం అసాధ్యం. అయినా లక్ష్మీ సరస్వతులు కలసి ఎల్లప్పుడూ అన్నిచోట్లా నిలవాలని ఆశయం. ఆ తల్లుల మైత్రి అలరుగాక!
మనుచరిత్ర - ప్రబంధ దర్శనం
పారదర్శక విమర్శ
పీఠిక
ఆంధ్రదేశ సాహిత్య చరిత్రల్లో క్రీ.శ. 16వ శతాబ్ది ప్రదమార్థం ‘‘ఇటువంక బంగాళాంగ కళింగ సుభటాభ్రశ్రేణి ఝంఝానిలమై, అటువంక ఉమ్మత్తూరు శివసముద్ర పుర సప్రోన్మూలనాడంబరుడై, కలబరిగి కటకక్షితి రక్షకుడై, శ్రీ ఖండ శీతనగ మధ్యాఖండ క్షోణిమండలాఖండలుడై, మూరురాయర గండడై, యవన రాజ్య స్థాపనాచార్యుడనియు, కన్నడ రాజ్య రమారమణుడనియు జగజ్జేగీయ మానుడైన’’ (శ్రీ వెంపరాల సూర్య నారాయణ శాస్ర్తిగారి మనుచరిత్ర వ్యాఖ్యాన పీఠిక పుట 17) ‘‘ప్రబల రాజాధిరాజ రాజవీ-రప్రతాప, రాజపరమేశ్వరార్థ దుర్గానటేశ, సాహితీ సమరాంగణ-సార్వభౌమ, శ్రీ కృష్ణరాయేంద్ర...’’ (ఆ.మా.ఉ ఆశ్వా 44ప) విజయ నగర -్భవన విజయ మహాసామ్రాజ్యం దిగ్గజ పరీత సువర్ణకల్పమై వెలుగొందింది.
ఇంకాఉంది

జొన్నవిత్తుల రామకృష్ణ శర్మ 9440037258