Others

ఈ జీవితం... ఓ నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లబోదిబో ప్రొడక్షన్స్ వారి అబ్బో అబ్బో
*
సెనక్కాయలవాడు: బొకే బాగుందమ్మా! ఉంచేసుకో! వెళ్ళకమ్మా! వాళ్ళు తీయబోయే చిత్రానికి నేనే పెట్టుబడి పెడ్తాను. వాళ్ళు నిజాయితీగా సినిమా తీయగలరు. మీకు అడ్వాన్స్ ఇపుడే, ఈ క్షణంలోనే ఇస్తాను.
హీరో:ఏమిటిదంతా!
ఏ.వి.రావు: నీ విషయం సరిగా చెప్పు!
జయరావు:మేం నమ్మలేకుండా వున్నాం!
సెనక్కాయలవాడు: నిజమే బాబూ నమ్మలేరు. నాబోటి పేదవాడు సినిమాకి పెట్టుబడి ఎలా పెడ్తాడనికదా మీ అనుమానం. వినండి మరి! నేను ఒకనాటి నిర్మాతనే! నేను ధనవంతుణ్ణే! కాని సినిమా కథా కమామిషు తెలిసినవాడ్ని కాదు. అందువలన తెలివితేటలున్న తేటతెల్లనైన మనుష్యులకోసం చూశాను. అప్పట్లో నాకు దొరికిన వాళ్ళంతా అస్తమానం మందుగాళ్ళు, అస్తమయమయ్యాక పొందుగాళ్ళు. సెనక్కాయల చేనమ్మి సినిమా ఆరంభించా! ఆ సినిమా సగంలోనే ఆగిపోయింది. అయితే నేను నిర్మాతను కావాలన్న కోరిక మాత్రం అలానే వుంది. మళ్లీ కష్టపడి సంపాదించా! ఇక్కడ వీళ్ళను చూచి వీళ్ళ మాటల్ని విన్నాను. నాకు ధైర్యమొచ్చింది. అందుకే వీళ్ళను తోడుచేసుకొని సినిమా తీయదలిచా!
హీరో:సెనక్కాయల బుట్టలోంచి ఏమిటో తీస్తున్నాడు!
హీరోయిన్:అబ్బా! అంత డబ్బే!
ఏ.వి.రావు:ఇక మనకు డోకాలేదు.
జయరావు: సినిమా తీస్తాం.
సెనక్కాయలవాడు: తీసుకోండి మీ అడ్వాన్స్. తప్పకుండా వీళ్ళ సినిమాలో మీరే హీరో, హీరోయిన్లు!
జయరావు: నువ్వు చెప్పింది బాగుంది. నీ దగ్గర డబ్బున్నది అర్థమైంది. అయితే నువ్వెవరో మాకు అసలు తెలీదు. ఈ డబ్బు అక్రమ సంపాదనా! సక్రమ సంపాదనా కూడా మాకు తెలీదు కదా! దీని తాలూకు లెక్కలన్నీ సరిగానే వున్నాయా? ఇన్‌కంటాక్స్ సరిగానే చెల్లించిన దాఖలాలున్నాయా? ఇది నా అనుమానం.
ఏ.వి.రావు:ఇంత డబ్బున్న నీవు ఈ పార్కులో ఈ వేషం కట్టి తిరగడమెందుకు? ఇది నా అనుమానం.
సెనక్కాయలవాడు: మీకా అనుమానమేమీ అక్కర్లేదు! అన్నీ సరిగా వున్నాయ్. అన్నీ చూసుకోవచ్చు. నేను డబ్బున్నవాడిగా తిరుగుతుంటే ఎవరో ఒకరు నా సినిమా పిచ్చిని పసిగట్టి నా దగ్గర చేరి నా మొదటి చిత్రంలా చేస్తారని నయం. అందుకే ఈ వేషం కట్టా! మీకు మంచి ఆలోచనలున్నయి కానీ మీ దగ్గర డబ్బులేదు. అంతే మీకూ నాకూ వున్న తేడా! మీకిష్టం లేకపోతే చెప్పండి. నా దారిన నే వెళ్తా!
హీరో: అమ్మమ్మ! వద్దు వద్దు. మా అడ్వాన్స్ మాకివ్వండి.
హీరోయిన్: మేం తప్పకుండా మీ సినిమాలో నటిస్తాం.
జయరావు:ఏమంటావ్ ఏ.వి.రావు హీరో, హీరోయిన్లు దొరికారు! పెట్టుబడి పెట్టే దాత దొరికాడు! ఇంకెందుకాలస్యం.
ఏ.వి.రావు: నా ఆలస్యం ఏం లేదు. ఈ సినిమాకు ఏం పేరు పెడదామంటావ్.
జయరావు:మనం నాలుగేళ్ళబట్టీ లబో దిబోమని కొట్టుకుంటుంటే ఇప్పటికి అవకాశం దొరికింది మరి. నువ్వే ఆలోచించి చెప్పు!
సెనక్కాయలవాడు:నేనెప్పుడో ఆలోచించి వుంచా! ఇదివరకు నేను తీసిన సినిమా ‘అబ్బో అబ్బో ప్రొడక్షన్స్ వారి ‘లబోదిబో’. ఇపుడు తీసే సినిమా లబోదిబో ప్రొడక్షన్స్‌వారి ‘అబ్బో అబ్బో’.
అందరూ నవ్వు: అబ్బో! అబ్బో! భలేగా వుంది.
*
(సమాప్తం)
*
హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైన నాటికలు - ఈ జీవితం ఓ నాటకం - రచన: షణ్ముఖశ్రీ. శ్రీ షణ్ముఖ పబ్లికేషన్స్, హైదరాబాద్.

- షణ్ముఖశ్రీ 8897853339