Others

మొక్కలకు గాలి, నీరు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాలనిచ్చే మొక్కలను పెంచుకోవాలన్న ఆలోచన, అభిరుచి వుంటే సరిపోదు- మొక్కలు పెంచుకోవాలంటే ఉత్సాహంగా వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
చక్కని గాలి వెలుతురు వుండేలా చూస్తూ, ప్రతిరోజూ వాటికి నీళ్లు పోయాలి. రెండు రోజులు ఊరెళ్లాలన్నా వాటికి నీళ్లెలా అని సతమతవౌతుంటాం.
కొన్ని మొక్కలకైతే నీరు అవసరం లేకుండా గాలి ఉంటే చాలు. గాలిని భోంచేస్తాయి. ఇవి గాలిలోని తేమ, పోషకాలు పీల్చుకొని బతుకుతాయి. అటువంటి మొక్కలే తిల్లాండ్పియా.
చిన్న చిన్న వేళ్ళు, చిన్న ఆకులతో నీలం, గులాబీ, పసుపు రంగు పూలతో వుంటాయి. కాక్టస్ రకాలుగా కనిపించే వీటిని హ్యాంగింగ్ ప్లాంటుగా పెంచుతాయి. ఖాళీగా వుండే బట్టీల్లో లేదా వేలాడేవాటిని పెంచుకోవచ్చు.
మొక్కను తెచ్చుకొని కాసేపు నీళ్లలో తడిపి ఉంచి, ఆ నీళ్ళు బాగా ఆరిపోయాక ఎక్కడ పెట్టి పెంచాలనుకున్నామో అక్కడ పెట్టేస్తే చాలు. గాలి వెలుతురు తగిలితే చాలు ఈ మొక్కలు చక్కగా ఎదుగుతాయి. అపుడపుడు కాసిని నీళ్ళు చిలకరిస్తే చాలు. మొక్కలు ఏపుగా పెరిగి అందాలనిస్తాయి.

-తులసి జ్యోతి