Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ మేలు బంతిగ మెఱయంగ మెలగవలయు
వెన్నుఁదట్టుచు నిలబడి వెలుగవలయు
దీనజన హృదయాలలోఁ దిరుగవలయుఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: మనమంతా పదిమందికీ ఆదర్శప్రాయంగా ప్రకాశించేలా నడచుకోవాలి. అండగా మేమున్నామంటూ వెన్నుతడుతూ నిలబడి ఎంతగానో ప్రకాశించాలి. దీనజనుల హృదయాలలో ఎల్లప్పుడూ మనం సంచరిస్తుండాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించు స్వామీ!
తే.గీ కరగిపోయెడి కాలాన గతులు మతులు
దప్పియుంబ్రవర్తింపకు మెప్పటికిని
ఖ్యాతినొందంగ వలయునీ యవని మెచ్చఁ
జూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: కాలం అనేది క్రొవ్వొత్తిలా కరిగిపోతుంటుంది. అలా కరిగిపోయే కాలగమనంలో గతులు, మతులు తప్పిపోయి ఎప్పటికీ ప్రవర్తించకూడదు. అవని జనులంతా మెచ్చుకొనేలా ఖ్యాతి గడించాలని కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! ఈ లోకానికి ప్రబోధించు తండ్రీ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262