Others

ఈ జీవితం... ఓ నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపావళి బావ
*
(ఆకాశవాణిలో ‘రారా మా ఇంటిదాకా’ అన్న త్యాగరాజకృతి వినవస్తుంటుంది)
(శ్రీనివాస్ చప్పట్లు కొడుతూ వసంత ఇంటి లోపలికి ప్రవేశించాడు. అతడు ప్రవేశించగానే రేడియో ఆగిపోయింది)

శ్రీనివాస్: ‘రారా మాయింటిదాకా’ అంటూ వీధిలోకి వినబడుతుంటే, ననే్ననేమో ననుకొని ఎగిరి గంతేసి లోపలికే వచ్చేశాను.
వసంత: (తనలో) తలుపేయడం మరచాను. ఎవడో ఏమిటో? ఎకాఎకీ లోపలికే వచ్చేశాడు. (పైకి) ఎవరు మీరు?
శ్రీనివాస్: నన్ను శ్రీనివాస్ అంటారు. ఏ నివాసంలోకైనా చొరవగా వెళ్లగలను.
వసంత: గౌరవనీయులైన చోరులా?
శ్రీనివాస్: చాలా కరెక్టుగా చెప్పారు. మీరెవరో కూడా చెప్తే బాగుంటుంది?
వసంత:నా పేరు వసంత. నేనెవరో నేను చెప్పకుండానే మీరు తెలుసుకుంటారు కొద్దిసేపట్లోనే.
శ్రీనివాస్: వెల్!
వసంత: మీ చోర వృత్తిని గురించి చెప్పారు కాదు.
శ్రీనివాస్: అదే చెప్పబోతున్నాను. మీరే అడిగేశారు. ‘నా అందంతో అతివల హృదయాలను దోచుకొని, దోబూచులాడుతుంటాను’ అని అనుకుంటున్నారా?
వసంత: మీకింక వేరే పనేం లేదా? నేనెందుకనుకుంటాను.
శ్రీనివాస్: ఎన్ని పనులున్నా నా ముఖ్యమైన పని ఇదేననిపిస్తుంది.
వసంత: ప్రతి కుంకకు ఈమధ్య ఇదే పనిలేండి. పవిత్రమైన నాదాన్ని, వేదాన్ని చౌకబారు భావాలతో ముడిబెట్టి, వినోదం కోసమో, వ్యాపార ప్రకటనల కోసమో, దేవుళ్ళనూ, గుళ్ళనూ దేనికిబడితే దానికి వాడుకోవడం. మన దేశ సంస్కృతీ సంప్రదాయాలను మనకు మనమే నాశనం చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది.
శ్రీనివాస్: వసంతగారూ! మీరు చెప్పింది అక్షరాలా నిజం. నాకే ఈ మాట ఎందుకు చెప్పారో కూడా అర్థమైంది. మీరు ఒంటరిగా వున్నారని తెలిసి నేను తుంటరిగా మీ ఇంట్లో కొచ్చాననేగా! మీరనుకొన్నట్లు నేను ఏ అలగా జనానికి సంబంధించిన సభ్యుణ్ణి కాదు. నేను మిమ్మల్ని ఏ యాడ్ కోసమో అడగానికి రాలేదు.
వసంత:(తనలో) వీడ్ని గురించి అపుడే ఓ నిర్ణయానికి రాకూడదు. బహుశా నాన్నగారు నాకోసం చూసిన పెళ్లికొడుకేమో! ఒంటరిగా వచ్చి నన్ను కలుసుకొని నా అభిప్రాయం తెలుసుకుందుకు వచ్చుంటాడు. పెద్దవాళ్లన్నట్లు పిల్లాడు బాగానే ఉన్నాడు.
శ్రీనివాస్: నేనింకా నిల్చొనే వున్నాను. మీరేమో మీలో మీరే ఏమేమిటో అనుకుంటున్నారు.
వసంత:అబ్బే ఏం లేదు. ఏం లేదు. కూర్చోండి కూర్చోండి.
శ్రీనివాస్:్థంక్సు. కూర్చుంటా! కూర్చున్నా, నిల్చున్నా మీ ధ్యానమేగా.
వసంత: (తనలో) కూర్చున్నా, నిల్చున్నా నా ధ్యానమేనట. నేననుకొన్నది కరెక్టే. వీడికి నేను నచ్చాను. నాన్నగార్కి కొంత బరువు తగ్గించినట్లే.
శ్రీనివాస్: మీలో మీరు కాకుండా డైరెక్టుగా నాతో మాట్లాడండి.
వసంత:ఏమిటో నాకలా అలవాటైపోయింది. రిహార్సల్ లేకుండా ఏ మాట బయటకు రివీల్ చేయను. కాలుజారినా, నోరు జారినా జీవితాంతం కుమిలిపోవాల్సిందేగా!

(ఇంకావుంది)
*
హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమైన నాటికలు - ఈ జీవితం ఓ నాటకం - రచన: షణ్ముఖశ్రీ. శ్రీ షణ్ముఖ పబ్లికేషన్స్, హైదరాబాద్.

- షణ్ముఖశ్రీ 8897853339