Others

ఆల్‌టైమ్ క్లాసిక్ (అలా.. అన్నమాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవదాసు చంద్రముఖని చివరిసారిగా చూసి పార్వతికోసం రైలెక్కి దుర్గాపూర్ రోడ్డులో దిగి బండి ఎక్కి తూలుతూ, మూలుగుతూ రక్తం కక్కుకుంటూ, ఉరుములు, మెరుపులు, వాన ప్రారంభం కాగానే ఒక చోట బండి బురదలో దిగబడిపోతే, బండి దిగి బండివానికి సహాయం చేసి, దుర్గాపూర్ రాగానే కదలలేని స్థితికి చేరుకుంటాడు. చివరి చూపులు మాత్రమే మిగిలిపోయిన దేవదాసును బండివాడు, ఊరిబయట చెట్టుక్రింద గడ్డిపరచి పరుండబెట్టగానే ఊరి పెద్దలు తన జేబులోని జాబు ఆధారంగా ఆయనను దేవదాసుగా గుర్తించడం విని, పార్వతికోసం అత్యాశగా చూసి కన్నుమూయడం, ఊరి పెద్ద అయిన పార్వతి భర్త గేటును మూసివేయండని అరవడం, తలుపులను ఢీకొట్టి పార్వతి పడిపోవడం.. ఇవి దేవదాసు చిత్రంలోని చివరి సన్నివేశాలు. అత్యంత భావోద్వేగానికి గురై, మిక్కిలి ఉత్కంఠతో చూస్తారు ఈ దృశ్యాన్ని ప్రేక్షకులు. దర్శకులు వేదాంతం రాఘవయ్య హృదయానికి హత్తుకుపోయేలా చాలా గొప్పగా చిత్రీకరించారు.
రచయిత సముద్రాల సీనియర్, దర్శకుడు వేదాంతం రాఘవయ్య, సంగీత దర్శకుడు సి.ఆర్.సుబ్బరామన్, డి.ఎల్.నారాయణ భాగస్వాములుగా కలిసి స్థాపించిన సంస్థ వినోదా పిక్చర్స్. దేవదాసు చిత్రాన్ని అక్టోబర్ 24న 1952న రేవతి స్టూడియోలో ప్రారంభించారు. ఎన్ని విమర్శలు ఎదురైనా ఛాలెంజిగా తీసుకుని అక్కినేని నాగేశ్వరరావు ‘నభూతో నభవిష్యతి’ అనిపించే విధంగా నటించారు.
హిందీలో దేవదాసుగా నటించిన దిలీప్‌కుమార్ ‘అక్కినేనిలా దేవదాసుగా నటించడం, ఆ పాత్రలో జీవించడం ప్రపంచంలో వేరెవరి తరం కాదు’ అనడం చూస్తే అక్కినేని గొప్పదనం ఏమిటో అవగతమవుతుంది. అందరూ అనుకున్నట్టుగా దేవదాసు నిర్మాణంలో వున్నప్పుడు అక్కినేని అన్నం మానేయలేదు. పైగా మీగడ పెరుగు వేసుకుని సుస్తుగా తిని షూటింగ్‌కు వెళ్ళేవాడినని, మత్తుగా కళ్లుండడానికి అర్థరాత్రి సమయంలో షూటింగ్‌లు జరిగేవని ఒకానొక సందర్భంలో పేర్కొన్నారు.
మొదట అనుకున్నట్టుగా షావుకారు జానకిని కాదని అంతవరకూ చిన్న పాత్రలు ధరించిన సావిత్రిని హీరోయిన్‌గా బుక్ చేయడంతో ఊహించనిరీతిలో చక్కని డైలాగ్ డెలివరీతో, క్షణక్షణానికి మూడ్ మార్చగల ప్రజ్ఞా పాటవాలతో ఫస్టుమార్కులు కొట్టేసి ఈ చిత్రంతో ఆంధ్ర దేశంలో తిరుగులేని నటిగా స్థిరపడింది. చంద్రముఖిగా లలిత తన నటన, నాట్యాలతో ప్రేక్షకులను మురిపించింది. బండివానిగా నటించి సీతారామ్ వున్నది కొద్దిసేపే అయినా ఆయన చూపిన హావభావాలు అమోఘం. పార్వతి భర్తగా సి.ఎస్.ఆర్, ఆయన కొడుకుగా జి.వి.జి, దేవదాసు స్నేహితులు భగవాన్‌గా పేకేటి, దేవదాసును అంటిపెట్టుకుని వుండే ధర్మన్నగా ఆరని సత్యనారాయణ, జమీందారుగా ఎస్.వి.రంగారావు నటించారు. ఇతర పాత్రల్లో ఆర్.నాగేశ్వరరావు, దొరస్వామి, సురభి కమలాభాయి, సుధాకర్, అనూరాధ, రక్తకన్నీరు సీత రాణించారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే సంగీత దర్శకులు సి.ఆర్.సుబ్బరామన్ కీర్తిశేషులవడంతో ఈ చిత్రాన్ని ఆయనకే అంకితం ఇవ్వడం జరిగింది. ఆయన అసిస్టెంట్లు విశ్వనాధన్, రాంమూర్తి రీరికార్డింగ్‌తోపాటు మిగిలిపోయిన ‘అందం చూడవయా’, ‘జగమే మాయ’ పాటలను అద్భుతంగా స్వరకల్పన చేయడం జరిగింది. దేవదాసు పాటలన్నీ మలచిన మణిపూసలు. ‘కుడి ఎడమైతే’, ‘చెలియ లేదు చెలిమి లేదు’, ‘కల ఇదని నిజమిదని’, ‘అంతా భ్రాంతియేనా’, ‘జగమే మాయా’, ‘పల్లెకు పోదాం పారును చూద్దాం’ పాటలు ఆంధ్రదేశమంతటా మారుమ్రోగాయి. సీనియర్ సముద్రాల కలం కదంతొక్కింది. బి.ఎస్.రంగ ఫొటోగ్రఫి ప్రేక్షకులతో సంభాషించింది. ఎందరో ప్రముఖ దర్శకులు ఎన్ని భాషల్లో నిర్మించినప్పటికీ అజరామరంగా నిలిచిపోయే దృశ్యకావ్యం అక్కినేని దేవదాసు.

-పూజారి నారాయణ