Others

కల్యాణ చక్రవర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్య అంటే సుఖం; అణమతి అంటే పొందటం; వెరసి కల్యాణం అవుతుంది. ఎవరీ కల్యాణ చక్రవర్తి? కల్యాణ చక్రవర్తి అన్న పేరు వింటూనే వున్నాం. కాని, మనం చెప్పుకోబోతున్న ఈ కల్యాణచక్రవర్తి మామూలు మనిషి కాడు. అసాధారణ వ్యక్తి! సర్వం సహా చక్రవర్తి!
భర్తృహరి సుభాషితంలో యతి- నృపతి సంవాదం వున్నది. ‘ఓరుూ! నువ్వు రాజువు; నేను యతిరాజును’ అంటాడు యతి నృపతితో. అది అహంకారానికి సూచిక అనుకోరాదు. ఆత్మవిశ్వాసంతో రాజు కళ్లు తెరిపించటానికి చెప్పిన జ్ఞాన రహస్యం! రాజులు రారాజులు, సామంతులు, సామ్రాట్టులు- తాము సుఖంగా వుండాలని తమ రాజ్యం సుభద్రంగా, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. అలా కోరుకోవటం తప్పుకాదు. అది పరిమితమైన కామన లేక స్వార్థంతో కూడిన ప్రవర్తన. అంతకుమించిన జగత్ కల్యాణాన్ని ఆకాంక్షించే వ్యక్తి ఒకడున్నాడు. అతడే కథానాయకుడైన కల్యాణ చక్రవర్తి!
గీత ఆత్మ సంయమన యోగం(6-40)లో ఈ ప్రస్తావన కనిపిస్తుంది. యోగభ్రష్టుడి గతి ఏమిటి? రెంటికి చెడ్డ రేవడేనా? అని అర్జునుడు కృష్ణ పరమాత్మను అడుగుతాడు. అభ్యాస యోగి ఆత్మోన్నతి కోసం, దైవసాక్షాత్కారం పొందటానికి, పనులు చేపట్టడంవల్ల, యోగారూఢుడై సాధనా మార్గంలో పయనం మొదలుపెట్టటంవల్ల, ఎలాంటి అధోగతి లేక దుర్గతి పాలు పడడని- భగవాన్ పార్థుడి అనుమానాన్ని పరిష్కరిస్తాడు. అభయం ఇచ్చాడు.
గాలికన్నా కడు వేగంగా పరుగెత్తే మనస్సును అభ్యాస, వైరాగ్యాల ద్వారా నిగ్రహించవచ్చు. యోగసిద్ధిని పొందనూవచ్చు. తపస్సుకన్నా, శాస్తజ్ఞ్రానంకన్నా, కామ్యకర్మకన్నా ఉన్నతమైనది అభ్యాసయోగం. అంచేత నువ్వూ యోగివి కావాలి అంటాడు కృష్ణుడు. మంచి పనులు చేసేవారందరూ కల్యాణకృతులే అనుకోవటం సహజం. తెలివితేటలతో ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగా మలచుకోగల సమర్థుడు మానవుడు. ప్రకృతిపైన ఆధిపత్యం సాధించగానే, ఆ వ్యక్తి కల్యాణచక్రవర్తి కాలేడు. ప్రస్తుతం ప్రకృతిని ఎలాగైనా లొంగదీసుకోవటానికి భౌతిక విజ్ఞానవేత్తలు తమ శాయశక్తులా కృషిచేస్తున్నారు. బాహ్యప్రకృతిపైన అఖండ విజయం సాధిస్తున్న విషయం కాదనలేం. మనల్ని పాలించే అంతరంగ ప్రకృతిని స్వాధీనం చేసుకోగలిగితే, బాహ్య ప్రకృతి దానంతట అదే దాసోహం అంటుంది. అలా స్వాధీనపరచుకోవటానికి కావలసింది శాస్త్ర విజ్ఞానం కాదు- ఆత్మ సంయమనం! అలా చేయటం అభ్యాసయోగికే సాధ్యం అవుతుంది.అభ్యాసం అంటే ప్రయత్నం, ఉపాయం, ధ్యానం, సంబంధం, చేరువ అని ఐదు అర్థాలు చెప్పుకోవచ్చు. ఈ సందర్భంలో ఉపాయం అన్న అర్థాన్ని తీసుకోవాలి. పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది యోగాలుగానే పరిగణించాలి. శరీరం, మనస్సు, ఇంద్రియాలు, వాటి పాటికి అవి పనులు చేసుకుపోతూనే వుంటాయి. ఆ పనులపైన దృష్టి నిలపటం చాలా అవసరం. వాటిని రహదారిమీద (రాజమార్గం) నడిపించటానికి బుద్ధిని ఏకాగ్రం చేయటమే అభ్యాసయోగం. శిక్షణ పొందిన గుర్రాలు చెప్పిన విధంగా దౌడు తీస్తాయి. సురక్షితంగా సాగి, గమ్యానికి చేరుస్తాయి. ఏకాగ్రబుద్ధితో శరీరేంద్రియ మనస్సులను నియంత్రించటం ద్వారా అభ్యాసయోగికి లౌకికంగా, పారలౌకికంగా, భౌతిక, ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించటం సులభం అవుతుంది.
అపర స్వభావమే అభ్యాసనం! మన వెనుకటి జన్మలలోని అభ్యాసాలన్నీ సూక్ష్మరూపంలో మనస్సులో పాదుకుని వుంటాయి. ఉత్తమ సంస్కారబలంవల్ల, అభ్యాసయోగి జగత్కల్యాణ చక్రవర్తి పదవిని అలంకరిస్తాడు. అతడి సత్వగుణ స్పందనలు సుహృతులకు, జగత్ కల్యాణ కృతులకు దారి దీపాలై వెలుగునిస్తాయి.

-నిరామయ