AADIVAVRAM - Others

సహోద్యోగులకు ప్రేరణ కల్గించడం ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహోద్యోగుల్లో ప్రేరణ కల్గించడం కొంచెం కష్టమైన పని. ఎందుకంటే వారంతా మీతో సమాన హోదా గలవారు. పైగా మీ ఆజ్ఞలను, బోధనలను వినడానికి తయారుగా ఉండరు. అంతేకాదు తమకన్నా ఎక్కువ పలుకుబడి గలవారి మాటలు వినడానికి మాత్రమే ఇష్టపడతారు.
అసలు మీ మాటలు వినాల్సిన అవసరం వారికేంటి? పై అధికారులను కదిలించగల పలుకుబడి ఉండే మీ సహోద్యోగులు వారి ప్రాముఖ్యతను మాత్రమే చూసుకుంటారు.
అందుకే సహోద్యోగులను ప్రేరణ చెందించాలంటే ముందుగా వారి దృష్టిలో వారికన్నా వారికి ఉపకరించే ఎన్నో విశేషాలు మీకు తెలుసుననే నమ్మిక వారిలో మీరు కల్గించాల్సి ఉంది. మీ సహోద్యోగులను శాసించగల అధికారాలు మీకు ఏమీ ఉండవు. అందుకే మీతోటి ఉద్యోగుల్లో మీరు సహకారం ఇస్తారని, మిమ్మల్ని నమ్మవచ్చునని, మీకు వారితో సత్సంబంధాలు ఉన్నాయని, మీరు మంచి రిసోర్స్ పర్సన్, కొత్త సమాచారం మీ వద్ద ఉందని, వారిలో నమ్మకం మీరు కల్గించాల్సి ఉంటుంది.
మీ తోటి ఉద్యోగులకు అవసరమయ్యే సమాచారంతో మీరు వారితో మాట్లాడాలి. కొంత చెప్పిన తరువాత వారు మిగిలిన విషయాలు చెప్పమని మీ వెనుక పడేటట్లు చేసుకోవాలి.
దృష్టిలో ఉంచుకోవాలి
ప్రాథమికంగా ప్రతి ఉద్యోగికి తమ విధి నిర్వహణకు అవసరమయ్యే సమాచారం కావాలి.
పలుకుబడి కలిగిన వ్యక్తులలో మీరు ప్రేరణ కల్గించినా వారు మీ మాటలను పెడచెవిన పెడతారు.
బాగా మాట్లాడగల్గిన వారిని పలుకుబడి గలవారి గాను, బాగా వినేవారిని వినయశీలురుగాను పరిగణిస్తారు.
మీకు తెలిసిన విషయాల నన్నింటిని ఒక్కసారిగా ప్రస్తావించకూడదు.
గొప్పగొప్ప ఐడియాలు ఉన్నతమైన మేథాశక్తి గలవారిని ఆకర్షిస్తాయి.
మీ తోటి ఉద్యోగులు మీ ముందు గాని, వెనుక గాని మీరు కల్గించిన ప్రేరణ శైలిని అనుకూలంగా గాని, ప్రతికూలంగా గాని అనుకరించవచ్చు.
మీ ప్రేరణ కారణంగా ఉద్యోగ నిర్వహణలో లబ్ది పొందినవారు తప్పక మీ మీద గౌరవ భావంతో ఉంటారు.
మీ సహోద్యోగి ఏ స్థానంలో ఉన్నాడో మీకు తెలియక మీకు సహాయకారిగా ఉంటాడని భావించి ప్రేరణ కల్గించే ప్రయత్నం చేసినపుడు ఒక్కొక్కప్పుడు మీ ప్రయత్నం మరింత ప్రతిభావంతంగా కొనసాగేందుకు అతడు మీకు తోడవ్వచ్చు.
మీకు ఉద్యోగ నిర్వహణకు సంబంధించిన సమాచారంపై పూర్తి అధీకృత, మీ దగ్గర గల రీసోర్సెస్‌పై అదుపు ఉన్నట్లయితే మీ సహోద్యోగులలో మీ పలుకుబడి పెరుగుతుంది.
ప్రేరణలో శైలికన్నా విషయానికి ప్రాముఖ్యత ఇవ్వాలి.
కోరడం, ఉత్సాహపరచడం వంటి స్ఫూర్తి ప్రక్రియలు చెయ్యాలి. అది శాసించడం, ఎలా నడుచుకోవాలో కొంచెం అధీకృతంగా చెప్పడం వంటి ప్రక్రియలకన్నా మేలుగా ఉంటుంది.
మీ స్ఫూర్తి కార్యక్రమానికి ఎవరికి పేరు వస్తుంది అనే విషయాన్ని మీరు లక్ష్యపెట్టకపోతే మీ ప్రయత్నాలు మరింత వేగాన్ని పుంజుకుంటాయి.
అనువర్తనాలు
మీ సహోద్యోగులతో తాదాత్మ్యం చెందుతూ మీ వ్యక్తిగత అవసరాలను అనుసంధానపరుస్తూ భావావేశంతో అర్థవంతంగా చెప్పాలి.
మీరు చెప్పే విషయాల్లో మీరు కూడా భాగస్వాములని తెలియజేయాలి.
తోటి ఉద్యోగులు సహాయం కోరుతున్నప్పుడు ఆ విషయంలో మీరు ఎంత ఉన్నతంగా ప్రయత్నించాక వారి సహాయం అడుగుతున్నది తెలియజేయాలి.
మీ అభిప్రాయాలను చెప్పకుండా మీ సహోద్యోగులు తాము ఏ స్థితిలో ఉండాల్సిన వారో వారే ఆలోచించుకుని, తమ గురించి తాము విశే్లషణ చేసుకునే స్థితికి వచ్చేటట్లు స్ఫూర్తి కల్గించాలి.
మీ ఆలోచనలు భేషుగ్గా ఉన్నాయనే భావం వారిలో కలుగజేయగల్గితే వారిలో ఎక్కువమంది మీ మాటలకు ప్రేరణ పొంది ఆ ఆలోచనలను ఆమోదిస్తారు.
వ్యాపారంలో సాధారణంగా తోటి వ్యాపారస్థులు మీ సలహాల కోసం ముందుకు రావడానికి సుముఖంగా ఉండరు. ఎందుకంటే వారిని మీరు నిరాకరిస్తారనే భయం వారికి ఉంటుంది. కాని వారికి తగిన భరోసా ఇస్తూ ‘మీకు నేను ఉన్నాను’ అనే ధీమాను కలుగజేయగల్గాలి.
మీ సహోద్యోగుల సహకారం తప్పనిసరిగా అవసరం అవుతుందనే విషయాన్ని వారి మనసుల్లో నాటుకునేటట్లు మీరు ప్రేరణ కల్గించగల్గాలి.
ప్రతి ఒక్కరి ప్రాముఖ్యత గుర్తు చేస్తూ ఉండాలి.
మీరు చాలా శక్తివంతులు, బలమైన వారు, లేదా పలుకుబడి గలవారు అనే భావం మీరు తోటి ఉద్యోగుల్లో ఏర్పరచుకో గల్గితే వారంతా మిమ్మల్ని ఆ విధంగానే గౌరవిస్తారు. అటువంటి భావం ఎలా సృష్టించుకోవాలి?
ఏదైనా సమస్య ఎదురయినపుడు దాని గురించి పోరాటం చేయాలి. అయితే ఈ పోరాటం వల్ల నష్టం వాటిల్లుతుందని ముందుగానే మీరు గ్రహించగల్గితే ఆ పోరాటాన్ని మరింత కొనసాగించకుండా నిలిపివేయాలి. మీ పోరాట పటిమను సహోద్యోగులు మనసారా అభినందిస్తారు.
పోరాటం కొనసాగిస్తే ఎదురయ్యే కష్టనష్టాలు తోటి వారికి వివరించి చెప్పాలి.
మీ సహోద్యోగులకన్నా వయసులో మీరు చిన్నవారయితే మీ సామర్థ్యాన్ని, అనుభవాన్ని పరోక్షంగా తెలియజేస్తూ ఎటువంటి సవాళ్లనయినా ఎదుర్కొనేందుకు సంసిద్ధులుగా ఉన్నట్లు వారికి స్పష్టంగా తెలియజెప్పాలి.
మీ సహోద్యోగులు మీకు అండగా ఉండకపోయినా ఫరవాలేదు. శత్రువులకు అండగా ఉండవద్దని ప్రేరణ కల్గించాలి.

-సి.వి.సర్వేశ్వరశర్మ